పెన్సిల్ పైన 2B , HB, 2H, 9H లాంటి కోడ్ లు ఎందుకు ఉంటాయి..? వీటి అర్ధమేంటో తెలుసా..?

పెన్సిల్ పైన 2B , HB, 2H, 9H లాంటి కోడ్ లు ఎందుకు ఉంటాయి..? వీటి అర్ధమేంటో తెలుసా..?

by Anudeep

Ads

మనం స్కూల్ డేస్ లో ఉన్నపుడు పెన్సిల్స్ ను ఏ రేంజ్ లో వాడేవాళ్ళమో గుర్తుంది కదా. చిన్న తరగతుల వరకు పెన్స్ ని వాడనిచ్చేవారు కాదు. కేవలం పెన్సిల్స్ నే తెచ్చుకోమని చెప్పేవారు. ఎందుకంటే మనం ఆ టైం లో ఎక్కువగా పొరపాట్లు చేస్తూ ఉంటాము.

Video Advertisement

పెన్ తో రాస్తే వాటిని కొట్టేసి పక్కన రాసుకోవడం మినహా ఏమి చేయలేము. అదే పెన్సిల్ తో రాస్తే.. తప్పులు రాసినా వాటిని చెరిపేసి మరోసారి రాసుకోవచ్చు. అందుకే చిన్న తరగతి పిల్లలను పెన్సిల్ తో రాయమనేవారు.

codes 1

అయితే.. మనలని ఎక్కువగా HB పెన్సిల్స్ ను తెచ్చుకోమనేవారు గుర్తుందా..? ఎందుకంటే ఇవి చాలా డార్క్ గా, షార్ప్ గా కనిపిస్తాయి. అయితే.. ఈ HB లాగానే పెన్సిల్స్ కు ఇతర కోడ్స్ కూడా ఉన్నాయి. ఆ కోడ్స్ ఎందుకు ఉన్నాయో..? ఆ కోడ్ లకు అర్ధం ఏంటి..? అన్న విషయాలను ఈరోజు ఆర్టికల్ లో తెలుసుకుందాం.

codes 3

పెన్సిల్ ను వాడడం ద్వారా మంచి ఫలితాలు పొందాలి అంటే.. వాటిపై ఉండే కోడ్ ల ఉపయోగాలు కూడా తెలుసుకోవడం ముఖ్యం. పెన్సిల్ పైన HB అని రాసి ఉంటె.. అది బాగా నల్లగా రాస్తుందని అర్ధం. H అంటే హార్డ్, B అంటే బ్లాక్ అని అర్ధం. అదే HH అని రాసి ఉంటె అది ఇంకా ముదురు నలుపులో రాస్తుందని అర్ధం.

codes 4

ఇదే విధంగా వచ్చే 2B, 4B, 6B, 8B కోడ్ లు ఉంటె.. ఆ పెన్సిల్స్ మరింత డార్క్ గా ఉంటాయి. అంటే.. 2B కంటే 4B ఎక్కువ నల్లగా రాస్తుంది. వాటి నెంబర్ పెరిగే కొద్దీ.. వాటి నలుపుదనం పెరుగుతుంది. ఆయా పెన్సిల్స్ లో ఉపయోగించే గ్రాఫైట్ తరహాని బట్టి ఈ కోడ్స్ ని ఇస్తూ ఉంటారు. సాధారణంగా స్కూళ్లలో పిల్లలకు HB పెన్సిల్స్ ను సూచిస్తారు. ఇక డ్రాయింగ్స్ లో లేత షేడ్ కోసం 2B పెన్సిల్ ని వాడతారు. అలాగే.. బొమ్మలలో జుట్టుకి రంగు వేయడం కోసం 8B కోడ్ పెన్సిల్ ని వాడతారు.


End of Article

You may also like