చంద్రమండలం మీద భూమి కొనాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

చంద్రమండలం మీద భూమి కొనాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

by kavitha

Ads

చంద్రయాన్-3 భారతీయుల కలలను నిజం చేస్తూ, ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ ల్యాండింగ్ తో చరిత్ర సృష్టించింది. చందమామ దక్షిణ ధ్రువం పై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది.  చంద్రయాన్-3 విజయవంతం అవడంతో చంద్రుని పై అన్వేషణ కీలక దశకు చేరింది.

Video Advertisement

చంద్రుని ఉపరితలం నివాస యోగ్యమ కదా అనే విషయం పై రోవర్ ప్రజ్ఞాన్ అన్వేషణను  ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రుని పై భూమిని కొనుగోలు చేసే విషయం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చంద్రమండలం మీద భూమి కొనాలి అంటే రేటు ఎంతో ఇప్పుడు చూద్దాం..
చంద్రయాన్-3 విజయవంతం అయిన నేపథ్యంలో చంద్రుని పై భూమిని కొనుగోలు చేసే విషయం హాట్ టాపిక్ గా మారింది. ‘లూనార్ రిజిస్ట్రీ’ అనే వెబ్‌సైట్ ద్వారా చంద్రుని మీద భూమిని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. లూనార్ రిజిస్ట్రీ అధికారిక వెబ్‌సైట్‌ కు వెళ్ళి, అక్కడ వారు భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
కొందరు సినీ ప్రముఖులకు చందమామ పై ఇప్పటికే భూమి ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఒక అభిమాని చంద్రుని పై భూమిని బహుమతిగా ఇచ్చాడని కొన్నాళ్ల క్రితం షారూఖ్ స్వయంగా వెల్లడించాడు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖగోళ శాస్త్రం పై ఉన్న ఆసక్తితో  చంద్రుని పై భూమిని కొనుగోలు చేశాడు. సుశాంత్  కొనుగోలు చేసిన ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ ముస్కోవి అని పిలుస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చంద్రుడిపై 55 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసారట.
గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కుమార్తె సాయి విజ్ఞత ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తోంది. తన తల్లికి గిఫ్ట్ గా చంద్రుడిపై భూమిని ఆమె తల్లి వకుళాదేవి పేరుతో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా 2022లో అప్లై చేసింది. అది సరిగ్గా ఆగస్టు 23న అంటే చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన రోజు వకుళాదేవి మరియు ఆమె మనువరాలు పేర్ల పై జాబిల్లి పై ఒక ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ అయ్యింది. చందమామ పై ఎకరానికి దాదాపు 35 లక్షల రూపాయలకు పైగా రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది.

Also Read: “ఇలా అన్నాడేంటి..?” అని ట్రోల్ చేశారు..! కాని దానికి ఇంత అర్థం ఉందా..?

 


End of Article

You may also like