Home Off Beat మన చేతివేళ్ళని విరిచినప్పుడు టప్ మని శబ్దం వస్తుంది.. గమనించారా..? ఇలా ఎందుకు వస్తుందో తెలుసా..?

మన చేతివేళ్ళని విరిచినప్పుడు టప్ మని శబ్దం వస్తుంది.. గమనించారా..? ఇలా ఎందుకు వస్తుందో తెలుసా..?

by Anudeep

మనం పొద్దున్నే లేవగానే ఫస్ట్ చేసే పని ఒళ్ళు విరుచుకోవడం.. ఆ తరువాత చేతులను, చేతివేళ్ళను కూడా బాగా స్ట్రెచ్ చేస్తాం.. తద్వారా ఆక్టివ్ గా ఫీల్ అయ్యి ఆ తరువాత పనులను ప్రారంభిస్తాం. అయితే.. మనం ఇలా చేతి వేళ్ళను విరుచుకుంటున్నపుడు టప్ మని శబ్దం వస్తూ ఉంటుంది. గమనించారా..? ఈ శబ్దం ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

twisting fingers 1

మన శరీరం లో ఏ రెండు ఎముకల మధ్య అయినా సినోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవ పదార్ధం ఉంటుంది. గుడ్డు లోపలి సొన ఏ విధం గా ఉంటుందో.. ఈ సినోవియల్ ఫ్లూయిడ్ కూడా అలానే ఉంటుంది. ఇది లుబ్రికంట్ లా పని చేస్తూ ఉంటుంది. మనం చేతులని ముడిచి మళ్ళీ తీసినప్పుడు.. లోపల ఉండే ఈ ఫ్లూయిడ్ నైట్రోజన్ గ్యాస్ ను విడుదల చేస్తుంది. ఈ గ్యాస్ కొన్ని బుడగలు విడుదల చేస్తాయి.

twisting fingers 2

మనం ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ మూతను ఓపెన్ చేసినపుడు ఎలా గ్యాస్ ఫామ్ అయ్యి బుడగలు వస్తాయో.. అలానే ఎముకల మధ్య కూడా బుడగలు ఏర్పడతాయి. ఆ బుడగలు పేలడం వలన మనం చేతుల్ని మడిచి నొక్కినప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది. తిరిగి ఈ బుడగలు ఏర్పడాలి అంటే మరొక ఇరవై నిమిషాల సమయం అవసరం అవుతుంది.

twisting fingers 3

అందుకే మనం వెంట వెంటనే చేతులను విరిచినపుడు మొదటి సారి వచ్చిన శబ్దం మరొకసారి రాదు. కొంతసేపటి తరువాత మాత్రమే ఈ శబ్దం వస్తూ ఉంటుంది. దీనికి అసలు కారణం ఇదన్నమాట. అస్తమానం ఇలా వేళ్ళు విరవడం వలన.. ఎముకల వ్యాధి వస్తుందని కొందరు చెబుతూ ఉంటారు. అయితే.. ఇలాంటిదేమీ ఉండదని వైద్యులు చెబుతున్నారు.

You may also like