మనకి వాటర్ ట్యాంక్స్ ఎంత అవసరం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లు కావాల్సి వచ్చినప్పుడల్లా బోరింగ్ పంపు కొట్టడమో లేక బావి నుంచి తోడుకోవాల్సిన అవసరమో లేకుండా చేయడం కోసం వాటర్ ను మోటార్ సాయంతో ట్యాంక్ లో స్టోర్ చేసుకునే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉంటున్నాం.
ప్రస్తుతం ప్రతి ఇంటికి డాబా పైన ఒక వాటర్ ట్యాంక్ అనేది తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే.. మీరెప్పుడైనా గమనించారా? ఈ వాటర్ ట్యాంక్ కు పైన ఓపెన్ గా ఉన్న “T” షేప్ లో ఉన్న పైప్ ఉంటుంది.
ఈ పైప్ ఎందుకు ఉంటుంది? ఈ పైప్ వలన ఉపయోగం ఏంటి అన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అయితే మీ డౌట్ ను ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి. మనం ఓవర్‌హెడ్ ట్యాంక్ నుండి నీటిని ఉపయోగించినప్పుడు, బయటకు ప్రవహించే నీటి ద్వారా ఏర్పడిన ఖాళీ స్థలంలో గాలి వ్యాపిస్తూ ఉంటుంది. అయితే తిరిగి ఆ వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోయాక అందులో నీటిని నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మనం మోటార్ ఆన్ చేసినప్పుడు భూమి నుంచి నీరు ట్యాంక్ లో నిండుతూ ఉంటుంది. అయితే ఇలా నిండాలంటే ఆల్రెడీ వాటర్ ట్యాంక్ లో ఏర్పడ్డ గాలి బయటకు పోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓ అవుట్ లెట్ కూడా అవసరం పడుతుంది. ఎయిర్ వెంట్ ఓవర్ హెడ్ ట్యాంక్‌లో సులభంగా గాలి ప్రసరణకు సహాయపడుతుంది. అందుకే వాటర్ ట్యాంక్ కు పక్కనే “T” షేప్ లో ఉన్న ఎయిర్ వెంట్ ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా వాటర్ బయటకు పోయి ట్యాంక్ లో వాటర్ నిండడానికి అవకాశం ఏర్పడుతుంది. నీరు ట్యాంక్ లోపలకి ఫోర్స్ గా వస్తున్న సమయంలో నీటి కంటే గాలి బరువు తేలిక అవడం వల్ల ఈ గాలి అవుట్ లెట్ ద్వారా తేలికగా బయటకు పోతుంది.