Ads
ఎప్పుడైతే కరోనా వ్యాపించి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిందో అప్పటినుంచి ప్రతి ఒక్క రంగం లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సినీ రంగంలో చాలా మార్పులు ఎదురయ్యాయి. అప్పటి నుంచి థియేటర్ల లో సినిమాలు చూసేవారు తగ్గిపోయారు. దీంతో ఓటీటీ ల ప్రాభవం బాగా పెరిగిపోయింది.
Video Advertisement
ఈ నేపథ్యం లో వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలను పలు భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ‘పులి 19 వ శతాబ్దం’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామా గతేడాది సెప్టెంబర్ 8న మలయాళంలో రిలీజ్ అయ్యింది. 19 వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని రూపొందించారు.
అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని తెలుగులో ‘పులి 19 వ శతాబ్దం’ పేరుతో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ట్రావెన్ కోర్ కింగ్ డమ్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రానికి ప్రస్తుతం తెలుగులో మంచి స్పందన వస్తోంది.
నిర్మాత సీహెచ్. సుధాకర్ బాబు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసారు. కథ మొత్తం మలయాళ నేటివిటీ నేపథ్యంలో సాగుతుంది. 19వ శతాబ్దంలో ట్రావెన్ కోర్ ప్రాంతంలోని పరిస్థితులను ఆధారంగా చేసుకుని నిర్మితమైన సినిమానే ‘పులి’. ఆ సమయం లో పరిపాలన సంబంధమైన అన్ని వ్యవహారాలలో అగ్రకులాల వారే పెత్తనం చెలాయిస్తుంటారు. ఆరట్టుపుల వేలాయుధ ఫనికర్ అగ్రవర్ణాలతో పాటు బ్రిటీష్ పాలకులపై ఎలాంటి తిరుగుబాటు చేశాడనే అంశాన్ని ఇందులో చర్చించారు.
ఈ నేపథ్యం లో అనంత పద్మనాభ స్వామి నగలు ఒక బందిపోటు దొంగిలించడం తో రాజు ఏం చేస్తారు? ఈ విషయం తెలిసి వేలాయుధన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ. రాజు మంచివాడే .. కానీ ఆయన అధికార ప్రతినిధులు అగ్రవర్ణాలవారు. వాళ్లంతా తక్కువ కులస్థులను చట్టాల పేరుతో ఎలా వేధించారు? అనే కోణంలో ఈ కథను రాసుకున్నాడు. తక్కువ కులంలో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు, ప్రజలలో ధైర్యాన్ని నింపి వారిలో తిరుగుబాటు ఆలోచన ఎలా కలిగించాడు? అనే దారిలో ఈ కథ నడుస్తుంది.
ఈ కథ అంతా కూడా ఒక ప్రాంతం .. ఒక పరిధిలో జరుగుతుంది. అందుకు సంబంధించిన అద్భుతమైన లొకేషన్స్ లో సన్నివేశాలను ఆవిష్కరించాడు. హీరో వేలాయుధన్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు బాగుంది. ఆ పాత్రలో సిజు విల్సన్ జీవించాడు. మిగతా వాళ్లంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పచ్చు.
షాజీ కుమార్ కెమెరా అద్భుతమైన ఫ్రేమ్స్ నుంచి సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. అడవి .. చీకటి .. వర్షం .. పోరాటాల నేపథ్యంలోని సన్నివేశాలను గొప్పగా చూపించాడు. ఆయన సెట్ చేసిన లైటింగ్ బాగుంది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ కి .. అజయన్ సెట్స్ కి మంచి మార్కులు ఇవ్వచ్చు. ఈ చిత్రం సినిమా పరమైన హంగులు లేకుండా .. చరిత్రను చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఈ చిత్రానికి ప్రస్తుతం ఓటీటీలో మంచి స్పందన వస్తోంది.
Aslo read: “కమెడియన్ సుధాకర్” గుర్తున్నారా..?? ఇలా అయిపోయారేంటి..??
End of Article