Ads
మలయాళం సినిమాలు అంటే సహజంగా ఉంటాయి అని, అందులోనూ మంచి కంటెంట్ ఉంటుంది అని పేరు. ఇది వరకు తెలుగులో తమిళ్ సినిమాలు మాత్రమే ఎక్కువగా విడుదల అయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు మార్కెట్ బాగా పెరిగింది.
Video Advertisement
అలాగే ప్రస్తుతం చాలా మంది పెద్ద పెద్ద సినిమాలని కొన్ని వేల కోట్ల రూపాయలని ఖర్చు చేసి తీస్తున్నారు. అయినా కూడా ఆ సినిమాలు హిట్ అవడం లేదు. నిజానికి ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. పైగా సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు గొప్ప నటులు ఉండాల్సిన పని కూడా లేక పోయింది. మలయాళం లో ఇలా వచ్చిన చాలా చిత్రాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి.
తక్కువ బడ్జెట్ తో వచ్చి.. కలెక్షన్ల సునామి కురిపిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన 2018 ఆ కోవలోకి చెందిందే. అయితే అదే కాకుండా ‘తల్లుమాల’ అనే చిత్రం కూడా ఇలా సూపర్ హిట్ అయ్యింది. 20 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం 72 కోట్లు కాలేచ్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. టోవినో థామస్, కళ్యాణి ప్రియదర్శన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం గతేడాది మలయాళం లో రిలీజ్ అయ్యింది. దీనికి ఖలీద్ రెహమాన్ దర్శకుడు.
ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్ గా తీశారు. కథానాయకుడు వాజీమ్ జీవితంలోని పలు అధ్యాయాలను ఈ చిత్రం లో చూపించారు. అలాగే కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఓటీటీ లో ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా చాలా మంది దీనికి ఫాన్స్ అయ్యారు. నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు. టోవినో థామస్ ఈ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
Also read: రూ. 2 కోట్లతో సినిమా తీస్తే.. రూ. 50 కోట్ల కలెక్షన్స్… ఆ సినిమా ఏదో తెలుసా…?
End of Article