తాళం చెవులకు ఇచ్చే టాగ్ పై ఉండే ఈ నెంబర్ ఏంటి..? ఈ నెంబర్ ఉపయోగం తెలిస్తే అస్సలు పడేయరు..!

తాళం చెవులకు ఇచ్చే టాగ్ పై ఉండే ఈ నెంబర్ ఏంటి..? ఈ నెంబర్ ఉపయోగం తెలిస్తే అస్సలు పడేయరు..!

by Anudeep

Ads

సాధారణం గా మోటార్ సైకిళ్ళు, బైక్ లు, కార్లు వంటి వాహనాలను కొనుక్కున్నప్పుడు మనకు షో రూమ్ వాళ్లే డబుల్ కీ లను ఇస్తారు. ఒకటి పోతే ఇంకొకటి ఉంటుంది అని ఇస్తూ ఉంటారు.

Video Advertisement

 

అయితే.. ఒక కీ పోయినప్పుడు.. రెండవ కీ ని జాగ్రత్తగా వాడుకుంటాం.. లేదంటే ఆ కీ సాయం తో మరో కీ ని అయినా తయారు చేయించుకుంటాం. ఇంత ముందు జాగ్రత్త గా ఉండడం అన్నిసార్లు కుదరకపోవచ్చు.

tags

మరి అలాంటప్పుడు ఏమి చేయాలి..? కొత్త గా బండి కొన్నప్పుడు దాని తాళాలతో పాటు వచ్చే టాగ్ ను పారేయకండి. ఆ టాగ్ ను జాగ్రత్త చేసుకుని ఉంటే భవిష్యత్ లో రాబోయే ఇబ్బందిని అధిగమించవచ్చు. ఆ టాగ్ పై కొన్ని నంబర్లు ఉన్నాయి కదా. ఈ నంబర్ల సాయం తో ఆ బండికి అదే రకమైన కొత్త తాళాలను తయారు చేయవచ్చు. ఆ తాళం చెవికి సంబంధించిన నెంబర్ నే ఆ టాగ్ పై ఇస్తారు.

tags 1

ఒకవేళ రెండు తాళాలు పోగొట్టుకుంటే.. ఆ టాగ్ నెంబర్ ను అయినా దాచుకుని ఉన్నట్లయితే.. మీరు ఏ కంపెనీ బండి కొన్నారో.. ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఆ నెంబర్ ను చెప్తే మీరు కొత్త తాళం చెవులను పొందొచ్చు. ఒకవేళ సర్వీస్ సెంటర్ మీకు దగ్గరలో లేకపోతే.. ఆ నెంబర్ ద్వారా బయట ఎక్కడైనా కూడా తయారు చేయించుకోవచ్చు. అందుకే బండి కొన్నప్పుడు ఆ టాగ్ ను జాగ్రత్త పరచుకుంటే.. తాళాలు పోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.


End of Article

You may also like