మీ ఫ్రిడ్జ్ కి.. గోడకి దూరం ఎంత ఉందో చూసారా..?? కరెంటు బిల్ తగ్గాలంటే ఇలా చెయ్యండి..!!

మీ ఫ్రిడ్జ్ కి.. గోడకి దూరం ఎంత ఉందో చూసారా..?? కరెంటు బిల్ తగ్గాలంటే ఇలా చెయ్యండి..!!

by Anudeep

Ads

ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండడం ఆశ్చర్యమే. దాదాపుగా అందరు ఫ్రిడ్జ్ వాడుతున్నారు. ఫ్రిడ్జ్ లలో కూడా రకరకాల మోడల్స్ వస్తున్నాయి. ఇదివరకు కాలం లో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకొని తినేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ ఆధునిక కాలం లో అప్పటికప్పుడు వంట చేసుకొని తినడం కుదరట్లేదు. సో అందరూ ఫ్రిడ్జ్ ని తప్పనిసరిగా కొంటున్నారు.

Video Advertisement

ఫ్రిజ్ కొనాలి అనే నిర్ణయానికి రాగానే ముందుగా ఎవరైనా ఆలోచించేది ఇంట్లో దాన్ని ఎక్కడ ఉండాలి అనే. ఫ్రిజ్ చాలా ప్లేస్ ఆక్రమిస్తుంది. ఎక్కడ బడితే అక్కడ దాన్ని ఉంచలేం. చాలా మంది వంటగదికీ, హాల్‌కీ అందుబాటులో ఉండేలా దాన్ని ఉంచుతారు. అయితే ఫ్రిడ్జ్ ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల చాలా కరెంటు వృధా అవుతుంది.

చాలా మంది ఫ్రిడ్జ్ ని గోడకు అనుకున్నట్లుగా, అతుక్కొని ఉన్నట్లుగా ఉంచుతారు. అలా ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. గోడకూ, ఫ్రిజ్‌కీ కనీసం 10 అంగుళాల దూరం ఉండాలని సూచిస్తున్నారు. సాధారణం గా ఫ్రిడ్జ్ చల్లబడటానికి టైం పడుతుంది. ఈ శీతలీకరణ ప్రక్రియలో, గ్రిల్ ద్వారా లోపల నుండి వేడి విడుదల అవుతుంది. ఫ్రిజ్‌ను నేరుగా గోడకు కనెక్ట్ చేయకపోవడానికి ఇదే కారణం. రిఫ్రిజిరేటర్‌ను పూర్తిగా గోడకు ఆనుకుని ఉంచినట్లయితే, వేడి గాలి సరిగా బయటకు రాదు. ఎప్పుడైతే వేడి పోయేందుకు అవకాశం ఉండదో.. లోపలి వేడి సరిగా పోదు. దాంతో క్రమంగా కూలింగ్ తగ్గిపోతుంది.

what should be the distance between fridge and the wall..

కొన్ని ఫ్రిజ్‌లు ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటాయి. అంటే.. వేడి బయటకు పోకపోతే.. దాన్ని చల్లార్చేందుకు మరింత ఎక్కువగా కరెంటును వాడుకుంటాయి. గోడకు దూరంగా ఉంచితే.. వేడి గాలి తేలికగా బయటకు పోతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌ను లోపలి నుండి చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల ఎక్కువ కరెంట్‌ ఖర్చు అవుతుంది. అంతే కాకుండా ఫ్రిజ్‌ను నేరుగా హీటర్ లేదా ఇతర వేడిని ఉత్పత్తి చేసే వస్తువలకు దగ్గర ఉంచకూడదు. దీనివల్ల ఫ్రిజ్ లోపలి నుండి తడిగా ఉండటం ఐస్ తయారవుతుంది. అలా జరిగితే మీ ఫ్రిజ్‌లో పదార్థాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది.


End of Article

You may also like