Ads
మనం నిత్యం ట్రైన్స్ లో ప్రయాణం చేస్తూనే ఉంటాము కదా.. బస్సు తో పోలిస్తే ట్రైన్ సౌలభ్యం గా ఉంటుందని మనం అనుకుంటాము. ఎందుకంటే మనకి ఫుడ్ విషయం లో కానీ, ఇతర అవసరాల విషయం లో కానీ ట్రైన్ లో ఎక్కువ సౌకర్యాలుంటాయి. అదే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినపుడు..? బస్సు అయితే రోడ్డుపక్కన దగ్గర్లోనే ఉండే ఆసుపత్రికి తీసుకెళ్తుంది. కానీ, మరి ట్రైన్ లో ఎలా..? మీరు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నపుడు ఎప్పుడైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినపుడు ఇలా చేయండి.
Video Advertisement
ప్రతి రైలు లోను టీటీఈ (ట్రైన్ టికెట్ ఎగ్జామినర్) లు ఉంటారు కదా.. వీరు ట్రైన్ టికెట్ లు చెక్ చేయడం మాత్రమే కాదు. వీరికి కొన్ని అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి. రైలు లో ప్రయాణం చేసే ప్రయాణికులకు వీరు తమ సహాయ సహకారాలు అందించి , ప్రయాణికులు సురక్షితం గా గమ్యం చేరడానికి సహకరించాల్సి ఉంటుంది. ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయం లో ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆ ట్రైన్ టీటీఈ ని సంప్రదించాలి.
వారు తరువాత రాబోయే స్టేషన్ వద్దకు రైల్వే వైద్యులను సిద్ధం చేస్తారు. ట్రైన్ తరువాత స్టేషన్ కు రాగానే వైద్యులు మిమ్మల్ని చెక్ చేసి మీకు తక్షణం ఉపశమనం కలిగించే విధం గా మందులు రాసిస్తారు. మీ ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా సహకరిస్తారు. గమ్యం చేరే వరకు మీకు సహకరిస్తారు. ఏదైనా సీరియస్ సమస్య అయితే, కొంత మేర ఉపశమనం పొందాక, మీరు ఆసుపత్రికి వెళ్లడం మంచిది.
End of Article