రైలు ప్రయాణంలో లగేజ్ పోతే ఏం చేయాలి.? అలాగే ఏదైనా వస్తువు పడిపోతే ఇది గుర్తుపెట్టుకోండి.!

రైలు ప్రయాణంలో లగేజ్ పోతే ఏం చేయాలి.? అలాగే ఏదైనా వస్తువు పడిపోతే ఇది గుర్తుపెట్టుకోండి.!

by Megha Varna

Ads

రైలు ప్రయాణాలు చాలా మంది ఇష్టపడతారు. ఇతర వాహనాల శబ్దాలు ఏమీ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అలా రైలు వెళ్లిపోతుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే సమయం ఎక్కువ పట్టినా పర్వాలేదు హాయిగా ఏ తల నొప్పి లేకుండా వెళ్లొచ్చు అని అనుకునేవారు రైలులో వెళ్ళడానికి ఇష్టపడతారు.

Video Advertisement

ఒక్కొక్కసారి మనం రైల్లో వెళుతున్నప్పుడు మన బ్యాగ్ మిస్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీ సామాన్లు పోయినా మీరు బాధపడకండి. ఎందుకంటే ఇప్పుడు మీ సామాన్లు కనుక పోతే మీ వస్తువులకి మీరు పరిహారం పొందే అవకాశం ఒకటి ఉంది. అయితే ఈ పరిహారాన్ని కనుక మీరు పొందాలంటే దీనికోసం మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక కంప్లైంట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి రూల్స్ చాలా ఉన్నాయి. చాలా మందికి వీటిపై అవగాహన లేదు. అయితే మరి ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు వస్తువులని కనుక పోగొట్టుకుంటే ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం.

మీరు కనుక మీ వస్తువులని పోగొట్టుకుంటే ముందుగా ఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓ FIR ని నమోదు చేయించాలి.  మీ యొక్క వస్తువులు ఏవైతే కనిపించడం లేదో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఆరు నెలల్లోగా మీ వస్తువులు రాకపోతే అప్పుడు కన్జ్యూమర్ ఫోరమ్‌ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మీ వస్తువులకు మీరు పరిహారం పొందే అవకాశం ఉంది.

అంతే కాకుండా రైలు ప్రయాణం లో కిటికీలో నుంచి ఏమైనా వస్తువు పడిపోయింది అనుకోండి. రైలు తొందరగా వెళుతుంది కాబట్టి, కిందపడిన వస్తువు ఎంత ఖరీదు అయినా సరే ఇంక ఆ వస్తువు గురించి మర్చిపోవాల్సిందే. కానీ మీకు ఒకటి తెలుసా? ఇలా రైలులో ప్రయాణించేటప్పుడు మీ వస్తువు ఏదైనా కింద పడిపోతే దగ్గరలోని రైల్వే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇవ్వడానికి మీ వస్తువు పడిపోయిన ప్రదేశం ఏంటో మీకు తెలిస్తే చాలు. ట్రైన్ అంత వేగంగా వెళుతూ ఉంటే అసలు కిటికీ బయట ఏముందో చూడడమే కష్టమంటే. ఇంకా పడిపోయిన ప్రదేశం గురించి ఏం తెలుస్తుంది? అని అనుకుంటున్నారా? ఆ ప్రదేశం గురించి అంటే ప్రదేశం పేరు కాదు.

మన ట్రైన్ ప్రయాణించే ట్రాక్ పక్కన కొన్ని స్తంభాలుంటాయి.ఆ స్తంభాల మీద రెండు నంబర్లు ఉంటాయి. ఆ రెండు నెంబర్లకి మధ్య / సింబల్ ఉంటుంది. / సింబల్ పైన ఉన్న నంబర్ మీరు ట్రైన్ దిగే ప్రదేశం వరకు ప్రయాణించాల్సిన కిలోమీటర్లని సూచిస్తుంది. / సింబల్ కింద ఉన్న నంబర్ ఆ స్తంభం నెంబర్ సూచిస్తుంది.

కాబట్టి రైలు మీ వస్తువు పడిపోయిన ప్రదేశం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఆగినప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న జి ఆర్ పి (గవర్నమెంట్ రైల్వే పోలీస్) కి గాని లేదా స్టేషన్ మాస్టర్ కి గాని ఫిర్యాదు చేయండి. మీ వస్తువు తప్పకుండా దొరుకుతుంది అని హామీ అయితే ఇవ్వలేరు కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ ని పరిశీలించి వస్తువు కోసం కచ్చితంగా గాలిస్తారు.

 

 


End of Article

You may also like