సముద్రాన్ని దాటడం లాగే… ఆంజనేయుడు మాత్రమే చేయగలిగే 6 పనులు ఏమిటో తెలుసా..?

సముద్రాన్ని దాటడం లాగే… ఆంజనేయుడు మాత్రమే చేయగలిగే 6 పనులు ఏమిటో తెలుసా..?

by kavitha

Ads

హనుమంతుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు, మారుతి, బజరంగీ అంటూ అనేక పేర్లతో పిలిచే అంజనీసుతుడు సాక్షాత్తు ఆ శివుని అవతారమని శివ పురాణం చెబుతోంది. శ్రీ రామచంద్రుడు మహావిష్ణువు అవతారం అని తెలిసిన విషయమే. పురాణాల ప్రకారంగా వాయు దేవుడి వరంతో అంజనీదేవి, కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు.

Video Advertisement

భూమిపై లోకకళ్యాణం కోసం,  ధర్మాన్ని స్థాపించడం కోసం శ్రీరాముడికి సహకరించడానికి ఆంజనేయుడు జన్మించినట్టుగా శివ పురాణం చెబుతుంది. రామాయణంలో శ్రీ రాముడి వలె ఆంజనేయుడు కూడా గొప్పతనాన్ని కలిగి ఉన్న విషయం తెలిసిందే. మహా బలవంతుడు అయిన వాయుపుత్రుడి కథలు వినడం ద్వారా  లేదా చదవడం ద్వారా ఆత్మ విశ్వాసం, మానసిక ధైర్యo పెరుగుదలకు సహాయపడగలదని నమ్ముతారు. హనుమంతుడు మాత్రమే చేయగలిగిన 6 పనులు ఇప్పుడు చూద్దాం..

1. సముద్రాన్ని దాటడం :

సీతా దేవిని వెతికడానికి హనుమంతుడు,జాంబవంతుడు, అంగధుడు తదితరులు సముద్రం వద్దకు వచ్చి ఆగిపోయారు. దానిని దాటడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. ఆ తరుణంలో జాంబవంతుడు హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటి వెళ్లి, మళ్ళీ రాగల సమర్దునిగా తెలిపాడు. హనుమంతుడు తన శక్తి పైనే నమ్మకం లేకున్నా జాంబవంతుడు వంటి వారి ప్రోత్సాహంతో సముద్రాన్ని దాటాడు.

2. సీతాదేవిని కనుగొనడం :

హనుమంతుడు సముద్రాన్ని లఘించి, సీతా దేవి కోసం వెతకడానికి లంకను చేరాడు.లంకను కాపాడుతున్న లంకిణీని ఓడించాడు. అప్పటి వరకు ఆమెను హనుమంతుడు తప్ప ఎవరు ఓడించలేకపోయారు.ఓటమిని ఒప్పుకున్న లంకిణీ, సీతజాడను చెప్పగా, హనుమంతుడు సీతాదేవిని అశోకవనంలో గుర్తించాడు.

3.అక్షయకుమారుని సంహరించడం:

సీతమ్మను కనిపెట్టిన హనుమాన్ రాముడు ఇచ్చిన సందేశాన్ని చేరవేసాడు.ఆ తరువాత లంకలోని పలు ప్రాంతాలను హనుమంతుడు నాశనం చేశాడు. విషయం తెలిసిన రావణుడు కుమారుడు అక్షయ కుమారుని హనుమంతుడిని బంధిచి తీసుకురమన్ని పంపగా,అక్షయ కుమారుడిని హనుమంతుడు హత్యమరుస్తాడు.ఆ తారువత వచ్చిన ఇంద్రజిత్తు హనుమంతుని బంధించి,సభకు తీసుకెళ్లడం, తోకకు నిప్పు అంటించగా హనుమంతుడు లంక మొత్తాన్ని దహనం చేశాడు.

hanuman 2

4.విభీషణుని రాముని వద్దకు తీసుకెళ్లడం :

రావణసభలో రాముని పేరును స్మరిస్తూ వేడుకొంటున్న వ్యక్తిని హనుమంతుడు రావణుని తమ్ముడు విభీషణునిగా గుర్తించాడు. రాముని కలవాలనే కోరిక ఉన్నట్లు విభీషణుడు తెలుపగా, ఎవ్వరూ ఒప్పుకోకపోయినా హనుమంతుడు విభీషణున్ని రాముని వద్దకు తీసుకునివెళ్ళాడు. ఈ చర్యే ఆ తరువాత రామ,రావణ యుద్ధంలో రావణ సంహరానికి కారణమైంది.

5. సంజీవని పర్వతo తీసుకుని రావడం :

యుద్ధంలో ఇంద్రజిత్ లక్ష్మణుని మీద బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించినపుడు, లక్ష్మణుడు స్పృహకోల్పోతాడు. లక్ష్మణుడు తిరిగిలేవాలంటే సంజీవని ఒక్కటే పరిష్కారమని చెప్పడంతో, హిమాలయాలకు వెళ్ళిన హనుమాన్ సంజీవని గుర్తించడం కష్టం కావడంతో ఏకంగా ఆ పర్వతాన్నే పెకలించి, తీసుకుని వచ్చి,లక్ష్మణుడిని కాపాడుతాడు.

6. అనేకమంది రాక్షసులను సంహరించడం, రావణున్ని ఓడించడం:

రామ,రావణ యుద్ధంలో హనుమాన్ ఎంతోమంది రాక్షసులను సంహరించాడు.ఈ క్రమంలో రావణునికి, హనుమంతుడికి మధ్య భీకరయుద్ధం జరుగగా అందులో హనుమంతుడు రావణుని ఓడించి, సంహరించకుండా విడిచిపెట్టాడు.దానికి కారణం రాముడి చేతిలోనే రావణుడు చంపబడాలనే ఆలోచన.

Also Read: 10 ఏళ్ల బాలిక కలలో కనిపించిన కృష్ణుడు.. ఆమె ఆమె చెప్పిందని “దర్గా” దగ్గరలో తవ్వగా ఏం కనిపించిందంటే.?

 


End of Article

You may also like