స్విగ్గీ/జొమాటో లలో ఫుడ్ ఆర్డర్ చేసాక, కాన్సల్ అయిపోతే.. ఆ ఫుడ్ ని ఏమి చేస్తారో తెలుసా?

స్విగ్గీ/జొమాటో లలో ఫుడ్ ఆర్డర్ చేసాక, కాన్సల్ అయిపోతే.. ఆ ఫుడ్ ని ఏమి చేస్తారో తెలుసా?

by Anudeep

Ads

ఒకొక్కసారి మన ఇంట్లో భోజనం అందుబాటులో ఉండకపోవచ్చు. వంట రానివారికి చేసుకోవడం కష్టమే. వంట వచ్చిన వాళ్ళకి కూడా ఒకొక్కసారి చేసుకోవడానికి ఓపిక లేకపోవచ్చు. అలాంటప్పుడు మనందరం చేసే పని ఫుడ్ ఆర్డర్ పెట్టడం. ఫోటో పెట్టాలంటే మనకి గుర్తొచ్చేవి రెండే రెండు వెబ్సైట్స్. ఒకటి స్విగ్గీ ఇంకొకటి జొమాటో.

Video Advertisement

వీటిల్లో ప్రతి రోజు ఏదో ఒక డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మెంబర్షిప్ కి తగ్గట్టు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ వల్ల ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే, రోజు మొత్తంలో ఏ టైంలో అయినా ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు.

swiggy n zomato 1

అందులోనూ ముఖ్యంగా జొమాటోలో అయితే ప్రతి రెస్టారెంట్ మీద ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది. అయితే.. ఒక్కోసారి మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తరువాత మనకి వద్దు అని అనుకుంటే కాన్సల్ చేసేస్తాం. లేదా ఒక్కోసారి స్విగ్గీ లేదా జొమాటో వారే ఫుడ్ ని కాన్సల్ చేసేస్తారు. అయితే.. ఒకసారి కాన్సల్ అయిపోయాక ఈ ప్రిపేర్ అయిన ఫుడ్ ని ఏమి చేస్తారు? మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా..?

swiggy n zomato 2

స్విగ్గీ/జొమాటో లు మొదలైన తొలినాళ్లలో ఇలా ఫుడ్ ఆర్డర్ కాన్సల్ అయిపోతే.. డెలివరీ బాయ్స్ ఆ ఫుడ్ ను తిరిగి తీసుకెళ్లి అదే రెస్టారంట్ కి అప్పగించాల్సి వచ్చేది. అలా ఇచ్చిన తరువాత మాత్రమే సదరు డెలివరీ బాయ్ కి పాయింట్స్ వచ్చేవి. అలాగే.. కస్టమర్ కి డబ్బులు రిఫండ్ అయ్యేవి. మొదట్లో జొమాటో డెలివరీ బాయ్స్ మీదే ఫోకస్ చేసేది. అలాగే రెస్టారెంట్స్ కి మాత్రం కొంత కంపెన్సషన్ ఇచ్చేది. దీనితో కొన్ని రెస్టారెంట్లు ఈ అవకాశాన్ని మిస్ యూజ్ చేసేవి.

swiggy n zomato 3

దీనితో.. జొమాటో సంస్థ ఈ ప్రాసెస్ లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుతం ఎప్పుడైనా ఆర్డర్ కాన్సల్ అయిపోతే.. ఆ ఫుడ్ ని డెలివరీ బాయ్ తన ఇష్టప్రకారం వాడుకోవచ్చు. ఆ ఫుడ్ ని డెలివరీ బాయ్ అయినా తినవచ్చు.. లేక ఎవరైనా అవసరమైన వారికి ఆ ఫుడ్ ని అందచేయవచ్చు. ఒకవేళ ఆ ఫుడ్ రెస్టారెంట్ లో ఉండగానే కాన్సల్ అయితే.. ఆ ఫుడ్ రెస్టారెంట్ లోనే ఉండిపోతుంది. రెస్టారంట్ వారు మరొకరికి సేల్ చేసుకోవచ్చు. కానీ, రెస్టారంట్ నుంచి డెలివరీ బాయ్ చేతికి వచ్చిన తరువాత డెలివరీ బాయ్ తనకి నచ్చినట్లు చేయవచ్చు.


End of Article

You may also like