Ads
నిలబడే నీటిని తాగుతున్నారా..? దీనివల్ల ఈ 5 సమస్యలు వస్తాయని తెలిస్తే..ఇంకెప్పుడూ ఇలా చేయరు..!
మనం రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే..మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలి అంటే నీరు అవసరం ఎక్కువ ఉంటుంది. అందుకే సరిపడినంత నీటిని తీసుకోవాలి. అయితే.. నీటిని ఎలా తాగుతున్నాం..? అన్న సంగతి కూడా ముఖ్యమేనట. చాలా మంది నీటిని నిలబడే తాగుతూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదట. దీనివల్ల ఈ కింది సమస్యలు వస్తాయట. అవేంటో చూడండి..
Video Advertisement
#1. కిడ్నీ సమస్యలు: కూర్చున్నప్పుడు మన కిడ్నీలు బాగా పని చేస్తాయని, బాగా ఫిల్టర్ చేస్తాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. నిలబడే నీటిని తాగుతున్నప్పుడు.. నీరు డైరెక్ట్ గా కింద పొట్టకి చేరిపోతుంది. ఈ నీరు ఫిల్టర్ అవ్వదు. ఫలితంగా మూత్రాశయంలోకి నీటి మలినాలు చేరుతాయి. మూత్రనాళ రుగ్మతకు ఇది కారణం అవుతుంది.
#2. ఊపిరితిత్తుల సమస్యలు: నిలబడే నీటిని తాగడం వలన మన కాలేయం, జీర్ణవ్యవస్థకు అవసరం అయ్యే పోషకాలు అందవు. అవి నేరుగా దిగువ పొట్టకు వెళ్లిపోవడం వలన కాలేయానికి అవసరమైన పోషకాలు అందవు. అంతేకాదు,నీరు నిలబడి తాగడం వలన నీరు వేగంగా పొట్టను చేరుతుంది. ఫలితంగా ఉపిరితిత్త్తులకు తగినంత ఆక్సిజెన్ అందదు.
#3. ఆర్థరైటిస్: నిలబడినప్పుడు నరాలు ఉద్రిక్తత స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో నీటిని తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల టాక్సిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
#4. అజీర్ణం: నిలబడి నీటిని తాగడం వలన ఆ ఎఫెక్ట్ జీర్ణ వ్యవస్థపై పడుతుంది. ఈ నీరు నేరుగా పొత్తికడుపుని చేరి.. ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇబ్బందికర పరిస్థితిగా మారుతుంది.
#5. నిటారుగా కూర్చుని నీటిని తాగితే.. ఆ నీటి వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు నీటిలో ఉండే ఆక్సిజెన్ మెదడుని చేరి.. మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుంది.
End of Article