మనిషి చనిపోతే దహనం చేయడమో, సమాధి కట్టడమో చేస్తాం.. మరి కొందరు ఏమి చేస్తారో తెలుసా..?

మనిషి చనిపోతే దహనం చేయడమో, సమాధి కట్టడమో చేస్తాం.. మరి కొందరు ఏమి చేస్తారో తెలుసా..?

by Anudeep

Ads

సాధారణం గా అంత్యక్రియలను మనం విధిగా నిర్వహించాలి. ఎవరైనా మన బంధువులో, సన్నిహితులో ఈ లోకాన్ని వీడి వెళితే.. మనం వారికి అంత్యక్రియలు నిర్వహిస్తాం. మన సంప్రదాయం ప్రకారం వారిని దహనం చేయడమో.. పూడ్చి సమాధి కట్టడమో చేస్తాం.. అలానే.. మరికొందరికి కూడా వారి వారి సంప్రదాయాలు ఉంటాయి కదా.. కొన్నిటిని చూస్తే మనకి మరీ విచిత్రం గా అనిపిస్తాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

#1 గొంతునులిమి చంపేయడం:


ఒకప్పుడు మన దేశం లో సతీసహగమనం అనే ఆచారం ఉండేది. అంటే.. భర్త చనిపోతే అతనితోపాటు.. భార్యను కూడా దహనం చేసేసేవారు. ఇలాంటి సంప్రదాయం దక్షిణాఫ్రికా దేశం లో ఫిజి లో కూడా కనిపించేది. అక్కడ కూడా.. ఎవరైనా చనిపోతే.. చనిపోయిన వ్యక్తి ఒక్కరే వెళ్లకూడదని..అతనికి తోడుగా మరొకరిని కూడా చంపేస్తారు. గొంతు నులిమి చంపేయడం లేదా తాడు తో గొంతుకు కట్టి గట్టిగా లాగడం వంటివి చేసేవారు. ఇలా చేయడం వలన చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్మేవారు.

#2 నది/సముద్రాల్లో వదిలివేయడం:


మనం దహనం లేదా, సమాధి కట్టినట్లు.. దక్షిణ అమెరికా లో ప్రజలు మృతదేహాలను పారుతున్న నదీజలాల్లో, లేదా సముద్రాలలో వదిలేస్తారట..

#3 పక్షులకు ఆహరం గా వేయడం:


పర్సియన్ దేశ ప్రజలు చనిపోయిన వారి దేహాలను పక్షులకు ఆహరం గా వేస్తారట. చనిపోయిన వారి మృతదేహం వృధా అవకుండా ఉండేందుకు వారు ఇలా చేస్తారట.

#4 గుహల్లో ఉంచడం:


ఇజ్రాయిల్ , ఇరాక్ వంటి దేశాల్లో ఎవరైనా చనిపోతే.. వారి శవాలను ఊరి చివరన ఉండే గుహల్లో వదిలేస్తారట. శవాలను ఉంచడం కోసం వారు పెద్ద పెద్ద రాళ్లను కూడా ఉపయోగిస్తారట.

#5 శవాలను తినడం:


ఇది మరీ వింత గా అనిపిస్తున్నా.. ఒకప్పుడు ఈ సంప్రదాయం న్యూగినియా మరియు బ్రెజిల్ దేశాల్లో ఉండేదట. ఎవరైనా చనిపోతే.. వారి శవాన్ని ముక్కలు ముక్కలు గా చేసుకుని భుజిస్తారట.

#6 కాల్చడం:


హిందూ సంప్రదాయం ప్రకారం శవాలను కాల్చివేసి దహన సంస్కారాలను నిర్వర్తిస్తారు. ప్రస్తుతం మన దేశం లో ఎక్కువ చోట్ల ఇదే పద్దతి కనిపిస్తోంది.

#7 మమ్మీలు:


మమ్మీలు అనగానే మనకి ముందు గుర్తుకు వచ్చేది ఈజిప్టు. అక్కడ ఎవరైనా చనిపోతే.. వారిని గుడ్డలతో చుట్టి పెట్టెల్లో బంధిస్తారు. ఇలా.. చేస్తే చనిపోయిన వారు ఎప్పటికైనా తిరిగి వస్తారని వారు నమ్ముతారు. చైనా, శ్రీలంక, టిబెట్, థాయిలాండ్, భారత్ లో కొన్ని ప్రదేశాల్లో కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

#8 కొండ అంచున ఉరితీయడం:


ఈ సంప్రదాయం ఎక్కువ గా చైనా లో ఉంది. చనిపోయిన వారి శవాలను వీరు కొండ రాళ్ల మధ్య, లేదా కొండల అంచున పెట్టెల్లో పెట్టి ఉరి తీసారట. ఇలా చేస్తే వారు స్వర్గానికి చేరుకుంటారని నమ్ముతారు.

#9 ఖననం:


హిందువులు కాకుండా.. ఇతర మతాలలో చాలా మంది శవాలను ఖననం చేస్తూ ఉంటారు. అంటే.. పూడ్చేసి.. సమాధి కట్టేస్తారు. ఎక్కువగా ఇస్లాం, క్రిష్టియన్ మతస్థులు ఈ విధానాన్ని అవలంబిస్తారు.


End of Article

You may also like