పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలలో వాడి పడేసిన లాప్ టాప్ లను ఏమి చేస్తారు..? ఎవరికి ఇస్తారో తెలుసా..?

పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలలో వాడి పడేసిన లాప్ టాప్ లను ఏమి చేస్తారు..? ఎవరికి ఇస్తారో తెలుసా..?

by Anudeep

Ads

మీకెప్పుడైనా ఈ సందేహం వచ్చిందా..? సాఫ్ట్ వేర్ కంపెనీ అన్నాక లాప్ టాప్ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఒకసారి వాడేసిన లాప్ టాప్ లను వీరు ఏమి చేస్తారు..? పూర్తి గా స్పీడ్ లేకపోయినా వీటిల్లో చాలా లాప్ టాప్ లు బాగానే పని చేస్తూ ఉంటాయి. వీటిని వృధా గా పడేయలేరు కదా.. మరి వీటిని ఏమి చేస్తారు అన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా..?

Video Advertisement

laptop 1

వీటికి ఓ కోరా యూజర్ సరైన సమాధానాన్ని ఇచ్చారు. వికీ పీడియా లాంటి సంస్థలు ఇలాంటి లాప్ టాప్ లను ఏమి చేస్తాయో ఆయన వివరించారు. వికీమీడియా ఫౌండేషన్ అనేది ప్రపంచ లాభాపేక్ష రహిత సంస్థల్లో ఒకటి గా చలామణి అవుతోంది. ఈ సంస్థ పెద్దది ఏమి కాదు. ఓ మూడొందల మంది ఉద్యోగుల వరకు ఈ సంస్థ లో పని చేస్తూ ఉంటారట. ఈ వికీ మీడియా ఫౌండేషన్ సంస్థ వారే వికీ పీడియా కోసం పని చేస్తూ ఉంటారు.

laptop 2

వీరు ఇతర ప్రాజెక్ట్ లను కూడా ప్రోత్సహిస్తూ సమాచారాన్ని తమ పేజీలలో నిక్షిప్తం చేసి ఉచితంగా అందచేస్తూ ఉంటారు. ఈ ఫౌండేషన్ లో అనుభవజ్ఞులైన ఉద్యోగులు వికీపీడియా కోసం కష్టపడి పని చేసిన వారికి ఉచితంగా అందిస్తారు. కనీసం ఒక్క లాప్ టాప్ కూడా లేని వికీ పీడియన్లు లాప్ టాప్ అవసరం అయితే పబ్లిక్ గానే అప్లై చేసుకోవచ్చు. ఈ సంస్థ సీనియర్ ఉద్యోగి అయిన అసఫ్ బార్తోవ్ లేదా ఇతరులు ఎవరైనా ఈ అప్లికేషన్స్ ను వెరిఫై చేసి వారికి ఎవరో ఒకరి ద్వారా లాప్ టాప్ లను అందిస్తూ ఉంటారు. ఈ లాప్ టాప్ లు కొత్త లాప్ టాప్ ల లాగా లేకపోయినా.. అసలు ఏ లాప్ టాప్ లేని వారికి మాత్రం ఉపయోగకరంగా ఉంటాయి.


End of Article

You may also like