చపాతీ పిండిని ఎప్పుడైనా మిక్సీ జార్ లో కలిపారా..? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా…?

చపాతీ పిండిని ఎప్పుడైనా మిక్సీ జార్ లో కలిపారా..? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా…?

by Mounika Singaluri

Ads

భారతీయుల ఆహార పదార్థాలలో గోధుమ పిండికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువమంది గోధుమపిండితో చేసే చపాతీలు, పుల్కాలు, రోటీలు, పూరీలు ఇష్టంగా తింటూ ఉంటారు. పైగా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నార్త్ ఇండియన్స్ లో ఎక్కువ మంది అన్నానికి బదులుగా చపాతీని భోజనంలో తింటారు. మన దక్షిణ భారతదేశంలో కూడా చపాతీ తినే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పైగా సన్నబడాలి అనుకునేవారు రాత్రిపూట ఎక్కువ శాతం చపాతీని తింటుంటారు.

Video Advertisement

ఇండియాలో అన్నం తర్వాత ఎక్కువమంది తినే ఆహార పదార్ధం కూడా చపాతీనే అంట. అటువంటి చపాతీ తినడానికి సులభంగా ఉన్నా కూడా చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే చపాతి పిండికి జిగురు గుణం ఉంటుంది.

కలిపేటప్పుడు చాలా శ్రమతో కూడుకున్న పని. చాలామంది వేడి నీళ్లతోటి, పాలతోటి చపాతీ పిండిని కలుపుతూ ఉంటారు అలాంటప్పుడు చేతులకు అతుక్కుపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే చపాతీ పిండిని కలపాలంటే చాలా ఓపిక కూడా కావాలి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మహిమ వల్ల చపాతీ పిండిని కలిపే యంత్రాలు కూడా వచ్చేసాయి. కొన్నిచోట్ల అయితే డైరెక్ట్ చపాతీ పిండిని వేస్తే చాలు లోపల కలిపేసి, చపాతి చేసి, కాల్చి రోటి రూపంలో బయటికి వస్తుంది.

chapathi

అయితే చాలామందికి ఆ యంత్రాలు కొనుక్కోవడం అనేది సాధ్యపడదు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరి ఇంటిలోనూ మిక్సీ జార్లు ఉండే ఉంటాయి. ఇప్పుడు చపాతి పిండిని మిక్సీ జార్ లో కలిపితే ఏమవుతుంది అంటూ ఒక వీడియో వచ్చింది. కొద్దిగా చపాతీ పిండిని మిక్సీ జార్ లో వేసి తక్కువ పాళ్ళలో నీళ్లు వేసి మిక్సీ పడుతున్నారు. ఒక రెండు నిమిషాలకి చపాతి పిండి కలిసిపోయి మెత్తగా తయారవుతుంది. దాన్ని మనకి వీలైనట్టు ఉండలు చేసుకుని సులభతరంగా చపాతీలు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినవారు అరే ఇదేదో బాగుంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.మీరు కూడా ఒకసారి ఆ వీడియో పై ఓ లోక్ వెయ్యండి.

Also Reading:కొడుకు ఆడిన ఒకే ఒక్క అబద్ధం… ఈ మహిళ జీవితాన్నే మార్చేసింది..! భర్త తనని కొట్టడంతో..?


End of Article

You may also like