కలియుగం పూర్తి అయ్యాక..తిరిగి కృత, త్రేతా, ద్వాపర యుగాలు మొదలవుతాయా..? పురాణాల్లో ఏమని చెప్పబడింది?

కలియుగం పూర్తి అయ్యాక..తిరిగి కృత, త్రేతా, ద్వాపర యుగాలు మొదలవుతాయా..? పురాణాల్లో ఏమని చెప్పబడింది?

by Anudeep

Ads

కాలం అనంతమైనది. ఇప్పటికే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలు పూర్తి అయ్యి కలియుగం లో ప్రధమ పాదం నడుస్తోంది. ఇంకా నాలుగు పాదాలు నడవాల్సి ఉంది. ఈ నాలుగు పాదాలు పూర్తి అయ్యాక సృష్టి అంతం అవుతుందని అంటుంటారు. అయితే.. ఆ తరువాత ఏమి జరుగుతుందో మీకెప్పుడైనా సందేహం వచ్చిందా..? ఈ అనుమానం తీరాలంటే ముందు ఈ యుగాలు ఎలా ఏర్పడ్డాయి అన్న విషయం తెలియాల్సి ఉంది.

Video Advertisement

treta yugam

కృతయుగం లో కృత అన్న పదానికి “చెయ్యడం” అని అర్ధం. అంటే.. ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండా ఎవరికీ వారే ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే ఈ కాలాన్ని కృతయుగం గా పేర్కొన్నారు. అలాగే.. త్రేతా అంటే “మూడు” అని అర్ధం. అంటే ధర్మం మూడు పాదాలపై నడిచే కాలాన్ని త్రేతాయుగం అని పిలిచారు. ఇంకా.. “ద్వా” అంటే రెండు. అంటే ధర్మం రెండు పాదాలపై నడిచే కాలాన్ని ద్వాపర యుగం అన్నారు. ఇక, కలహాల సమాహారం గా నడిచే కాలాన్ని కలియుగమని పేర్కొన్నారు.

dwapara

ఈ కాలం లో ప్రతి చిన్న విషయానికి వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. యుగాన్ని బట్టి యుగపురుషుడు కూడా మారుతూ ఉంటాడు. తద్వారా ఆ యుగానికి సంబంధించిన ధర్మం లో కూడా మార్పు చేర్పులు ఉంటాయి. వీటికి అనుగుణం ధర్మాన్ని కాపాడుకుంటూ నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా నాలుగు యుగాలు పూర్తయ్యాక.. మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం మొదలవుతూ ఉంటాయి. యుగాలు, యుగపురుషులు మళ్ళీ ఏర్పడినప్పటికీ కథ మాత్రం మారుతూ ఉండే అవకాశం ఉంది.

kali yuga

ఇందుకు పురాణాల్లో ఓ కథ కూడా ఉంది. త్రేతాయుగం లో ఓ సారి శ్రీ రాముడు, ఆంజనేయ స్వామి వారిని పిలిచి ఇలా చెప్తారు.” ఆంజనేయా..! పట్టాభిషేక సమయం లో నా అంగుళీయకాన్ని బ్రహ్మ అడిగారని కానుక గా ఇచ్చేసాను. నా ఆ అంగుళీయకాన్ని చూడాలని అనిపిస్తోంది. ఒక్కసారి అడిగి తీసుకురమ్మని” పంపించారు. హనుమ బ్రహ్మ లోకం చేరి, అంగుళీయకం గురించి బ్రహ్మను అడుగగా.. బ్రహ్మ కొన్ని వేల ఉంగరాలు చూపించి వీటిల్లో ఉంది తీసుకో అంటూ హనుమ కు చెప్పారట.

brahma

వాటిని చూసిన హనుమ.. ఇన్ని ఉంగరాలు ఉన్నాయేంటని ప్రశ్నించగా..” ఇప్పటికి కొన్ని వేల యుగాలు గడిచాయని.. ప్రతి యుగం లోను శ్రీ రామ పట్టాభిషేకం సమయం లో అంగుళీయకాన్ని అడిగి తీసుకున్నానని” బ్రహ్మ సమాధానమిచ్చాడట. ఇప్పుడు అర్ధం అయింది కదా కాలం ఎంత అనంతమైనదో. ఇది కల్పిత కథ కాదు. వ్యాస మహర్షి చే రాయబడిన ఆధ్యాత్మ రామాయణం లోను, పరశురామ సంహిత లో కూడా చెప్పబడింది.

kudi edamaite

ఇటీవల విడుదల అయిన “కుడి ఎడమైతే” అన్న “ఆహ” వెబ్ సిరీస్ లో కూడా ఇలానే జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ లో “టైం లూప్” అన్న కాన్సెప్ట్ ను తీసుకున్నారు. ఒకటే కాలం రిపీటెడ్ గా జరుగుతున్నపుడు కథ వేరు గా జరిగే అవకాశం కూడా ఉంది. మనుషులు మారకపోవచ్చు. కానీ కథ మారుతూ ఉంటుంది. అలాగే.. యుగాలు మారుతూ ఉంటాయి.. మనుషులు కూడా ఏర్పడుతూనే ఉంటారు. కథ ఒక్కటే మారుతూ ఉండచ్చు.


End of Article

You may also like