Ads
చాలా మంది ప్రజలు ఉదయం నిద్రలేచిన వెంటనే టీ కోసం ఆరాటపడతారు. దేశంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం ఇదే. ఇందులో చక్కెర ఉంటుంది కాబట్టి బరువు పెరగడానికి కారణమవుతుంది. కొందరు రోజులో ఎన్ని టీలు తాగుతారో వారికే తెలియదు. భారతీయ జనాభాలో 64 శాతం మంది రోజూ టీ తాగడానికి ఇష్టపడతారు. కొందరు ఉదయం టీ తాగితే .. మరికొందరు సాయంత్రం సమయం లో టీ తాగుతారు. ఈ సందర్భంలో శరీరంలోని చక్కెర కొవ్వుగా మారడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు.
Video Advertisement
అయితే కొన్ని సమయాల్లో టీ తాగడం మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం పూట టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం పడుకునే 10 గంటల ముందు కెఫీన్‌ను తీసుకోకూడదని వారు తెలుపుతున్నారు. టీ తాగడం మంచిదే కానీ ఏ సమయం లో తాగాలి.. ఎంత తాగాలి అన్న దాన్ని గమనించుకోవాలి నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి బ్లాక్ టీ లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ పాలు.. పంచదార కలిపి తీసుకోవడం తో అవన్నీ నశించి.. ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్య లేని వారు, టీ అలవాటు లేని వారు, నిద్ర సమస్య లేని వారు, ఏ సమయం లో అయినా టీ తాగొచ్చని చెబుతున్నారు. వాటా సమస్యలు ఉన్నవారు, హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు, నిద్రలేమి తో బాధ పడేవారు టీ కి దూరంగా ఉండాలని నిపుణులు వెల్లడించారు.
ఒకవేళ టీ తాగే అలవాటును మార్చుకోవాలి అనుకుంటే గ్రీన్ టీ వంటి వివిధ రకాలైన టీలను ప్రయత్నించాలి. హైబిస్కస్ టీ, రోజ్ టీ వంటివి తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. కాబట్టి ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతే టీ తాగాలి. పాలతో ఎక్కువ టీ తాగవద్దు, ఇది టీలో కనీసం కొన్ని యాంటీఆక్సిడెంట్లను సంరక్షించడానికి సహాయపడుతుంది. అలాగే టీ కాచిన తర్వాత దానికి కాస్త పాలు ఆడ్ చేసి తాగటం మంచిది.
End of Article