ఒక కి.మీ జాతీయ రహదారి Vs ఒక కి.మీ రైల్వే ట్రాక్… ఏది నిర్మించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.?

ఒక కి.మీ జాతీయ రహదారి Vs ఒక కి.మీ రైల్వే ట్రాక్… ఏది నిర్మించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.?

by Anudeep

Ads

1 కి.మీ ఫోర్ లైన్ జాతీయ రహదారిని నిర్మించడం ఖరీదైనదా లేదా 1 కి.మీ రైల్వే ట్రాక్ ఖరీదైందా అని మీకెప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా..? అసలు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..? రోడ్డు మార్గం వేయడానికి సిమెంట్, కంకర, ఇసుక వంటివి అవసరం అవుతాయి.

Video Advertisement

 

అదే రైలు మార్గాన్ని నిర్మించాలంటే.. ఇసుక , కంకర రాళ్లతో పాటు ఇనుప కడ్డీలు అవసరం అవుతుంది. ఒక కి.మీ రైలు పట్టాలు వేయాలంటే.. చాల ఎక్కువ మొత్తం లోనే ఇనుము అవసరం అవుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఐఐ) ఇప్పటికే ఒక ఫోర్ లైన్ రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చుని తెలిపింది. భూమి ఖర్చు తో కలుపుకుని ఫోర్‌లైన్ రహదారులను కిలోమీటరుకు 8-9 కోట్ల రూపాయలు, ఆరు లేన్ల రహదారులను కిలోమీటరుకు 14 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

 

మరో వైపు, ఒక కిలోమీటర్ సాధారణ రైల్వే ట్రాక్ నిర్మాణానికి 10–14 కోట్లు ఖర్చవుతుండగా, ఒక కిలోమీటర్ హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూ .100-140 కోట్లు ఖర్చవుతాయి. ఒక కిలోమీటర్ మెట్రో ట్రాక్ నిర్మాణానికి 60–70 కోట్లు ఖర్చవుతుంది. రహదారులు మరియు రైల్వే ట్రాక్‌ల నిర్మాణ వ్యయం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అలానే, ప్రదేశాన్ని బట్టి ఈ ఖర్చు కూడా మారుతూ ఉంటుంది. రోడ్డు మార్గం తో పోలిస్తే.. రైలు మార్గాన్ని నిర్మించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.


End of Article

You may also like