Ads
దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలు ప్రధానంగా బియ్యంతో వండిన అన్నాన్ని తినడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.బియ్యాన్ని సంపూర్ణ ఆహారంగా ప్రజలు భావిస్తారు కాబట్టే మన దేశంలో వీటి వినియోగం ఎక్కువ. అయితే ఒకప్పుడు ప్రజలు దంపుడు బియ్యం ఎక్కువగా తినేవారు.అయితే మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారాయి.
Video Advertisement
తెల్ల బియ్యం రుచిగా ఉండటం వల్లే దీనిని తినడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది తెల్లగా కాకుండా గోధుమ, ఇతర రకాల బియ్యం తినడం ప్రారంభించారు. ఎరుపు, గోధుమ, తెలుపు, నలుపు బియ్యం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
#1 తెల్ల బియ్యం
మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల బియ్యాలలో తెల్ల బియ్యం ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీనిలో ఊక, పొట్టు, జెర్మ్స్ తొలగిస్తారు. దానివల్ల అవి త్వరగా పాడవవు. కానీ వీటిలోని పోషకాలు నశిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, థయామిన్, విటమిన్లు, కాల్షియం, ఫోలేట్ ఉంటాయి. ఫైబర్ తక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఈ బియ్యాన్ని తినకపోవడం మంచిది.
#2 బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్‌లో ఊక, మొలకలు ఉంటాయి, దీని నుంచి పొట్టు మాత్రమే తొలగిస్తారు. అందుకే పోషకాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే బ్రౌన్ రైస్‌లో తెల్ల బియ్యంతో సమానంగా కేలరీలు, పిండి పదార్థాలు ఉంటాయి.
#3 ఎర్ర బియ్యం
రెడ్ రైస్ లో ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీనిలో పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర బియ్యం ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఇది గుండె వ్యాధులను తగ్గించడానికి కూడా దోహదం చేస్తుంది. దీనిని తినడం వల్ల ఆకలి త్వరగా రాదు పొట్ట కూడా చాలా సేపు నిండి ఉంటుంది. అలాగే మీ శరీరంలోని క్యాన్సర్ కణాలను నివారించడంలో ఎర్ర బియ్యం సహాయపడుతుంది.
#4 నల్ల బియ్యం
నల్ల బియ్యాన్ని పర్పుల్ రైస్ అని కూడా పిలుస్తారు. ఈ బియ్యానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ కారణంగా ఈ బియ్యం నలుపు రంగును కలిగి ఉంటాయి. ఈ నల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తాయి. దీని కారణంగా తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. నల్ల బియ్యం బరువు తగ్గించడంలో, చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అయితే ఏ విధమైన బియ్యం లో అయినా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. తెల్ల బియ్యం తో పోలిస్తే రుపు, గోధుమ, నల్ల బియ్యం ఆరోగ్యకరమైన ఎంపిక. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ ఏ బియ్యం అయినా పరిమితం గా తినడం ముఖ్యం.
End of Article