అయోధ్య రామ మందిరానికి అత్యధిక విరాళం ఇచ్చింది ఈయనే… సినిమా స్టార్ కాదు, బిజినెస్ మెన్ కాదు..!

అయోధ్య రామ మందిరానికి అత్యధిక విరాళం ఇచ్చింది ఈయనే… సినిమా స్టార్ కాదు, బిజినెస్ మెన్ కాదు..!

by kavitha

Ads

హిందువుల దశాబ్దాల కల అయిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సోమవారం (జనవరి 22) నాడు  అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ నిర్మాణానికి రామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్టు భక్తులను  విరాళాలు కోరింది. ఈ అద్భుతమైన రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విరాళాలు ఇచ్చారు.

Video Advertisement

ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం రామమందిర నిర్మాణం కోసం  విరాళాలు ఇచ్చిన వారిలో ఉన్నారు. అయితే అయోధ్య రామ మందిర నిర్మాణానికి అతిపెద్ద విరాళాన్ని అందించిన వ్యక్తి  మొరారీ బాపు. ఇతను పెద్ద యాక్టర్ లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు. మరి అంత విరాళం ఇచ్చిన మొరారీ బాపు ఎవరో ఇప్పుడు చూద్దాం..ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అతిపెద్ద విరాళాన్ని అందించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు మొరారీ బాపు రామ మందిర నిర్మాణానికి అత్యధిక విరాళం ఇచ్చినట్టు ప్రకటించారు. మొరారీ బాపు గుజరాతీకి చెందిన ఆధ్యాత్మిక గురువు, రామ కథా పారాయణుడు.
1946లో గుజరాత్ లో జన్మించిన మొరారీ బాపు రామాయణ ప్రతిపాదకుడు. 60 ఏళ్ళుగా పండితుడు రామ కథా పఠనం ద్వారా సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సూత్రాలను దేశ విదేశాల్లో చెబుతూ వస్తున్నారు. రామజన్మభూమి ట్రస్టుకు ఇప్పటికే రూ.11.3 కోట్లు ఇచ్చామని బాపు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కథ ప్రదర్శన, విదేశాల నుండి సేకరించిన మిగిలిన నిధులను రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు చేరుస్తారు. ఇలా మొత్తం రూ.18.6 కోట్ల విరాళాలు సేకరించిన మొరారీ బాపు ట్రస్ట్‌కు అందించారు.
శాంతియుతంగా అయోధ్య వివాద పరిష్కరించుకోవాలని మొరారీ బాపు పిలుపునిచ్చారు. రామ భక్తుడైన మొరారీ బాపు రామమందిరం ప్రారంభోత్సవంతో మనసు నిండిపోయిందని చెప్పారు. రాముడు ఏ ఒక్క దేశానికి లేదా వర్గానికి చెందినవాడు కాదని రాముడు అందరికీ చెందినవాడని అంటారు. రామ్ లల్లా దీక్ష తరువాత, ఫిబ్రవరి 24 నుండి మార్చి 3 వరకు మొరారీ బాపు అయోధ్యలో కథను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.

Also Read: అయోధ్య రాముడి విగ్రహం నల్లగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా.?

 


End of Article

You may also like