కరోనా సమయం లో అందరూ ఎంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు కూడా అందర్నీ కడుపుబ్బా నవ్వించిన వీడియో ఏంటంటే ‘ఓలేటి లక్ష్మీ’ వీడియోనే. అంటే ఇది వీడియో కాదు ఒక ఆడియో. దానికి యానిమేషన్స్ చేసి వీడియో చేసారు. ఈ వీడియో కేవలం కరోనా టైంలోనే కాదు.. ఇప్పటికీ వైరల్‌ అవుతూనే ఉంది.

Video Advertisement

 

ఓలేటి లక్ష్మి అనే ఆమెకు కరోనా వచ్చిందని చెప్పేందుకు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిన హెల్త్ ఇన్‌స్పెక్టర్‌తో ఆమె సంభాషణ నవ్వులు పూయించింది. ఆమె అమాయకత్వంతో, తెలియనితనంతో చెప్పిన సమాధానాలతో పాటు తాను మాట్లాడకుండా చుట్టుపక్కల వారికి ఫోన్ ఇవ్వడంతో.. హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ అసహనానికి లోనై కర్మ కొద్దీ దొరుకుతారు జనాలు, మీ దుంపలు తెగ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబు అంటూ పంచ్‌లు పేల్చాడు. ఆ ఆడియో రికార్డింగ్ అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

who is oleti lakshmi..

అయితే ఈ వీడియో ఆధారం గా జబర్దస్త్ లో రాకెట్ రాఘవ గతం లో ఒక స్కిట్ చేయగా.. అది విపరీతంగా క్లిక్ అయ్యింది. అయితే ఆ వీడియో క్లిక్ అయ్యింది కానీ, ఆ మనిషి ఎవరో తెలీదు. దీంతో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఒకామెను తీసుకొచ్చి ఈమే ఓలేటి లక్ష్మి అని చెప్పారు. అయితే ఆమె ఓలెటి లక్ష్మి కాదు. ఏదో ఆడియెన్స్‌ను మభ్యపెట్టి రేటింగ్ పొందే ప్రయత్నం చేశారు షో నిర్వాహకులు.

who is oleti lakshmi..

కానీ ఆమె ఓలేటి లక్ష్మి కాదు. అప్పట్లో ఇక ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో.. టీవీఛానళ్లు లక్ష్మీ ఇంటిముందు క్యూ కట్టాయి. ఆమెది కృష్ణా జిల్లా. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. ‘కలెక్టర్‌ ఆఫీసు నుంచి మాకు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో ఫోన్‌ వచ్చింది. ఆ టైమ్‌లో ఫోన్‌ రావడం వల్ల మేమంతో భయపడ్డాం. అందుకే హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ చెప్పిన దానికి మేం చాలా కంగారపడిపోయి సరైన సమాధానాలివ్వలేదు. ఆయన కరోనా అంటుంటే.. నేనేమో ఏంటీ ఎకౌంటా అన్నాను. చివరికి పాజిటివ్‌ అని తెలుసుకున్నాక మేమంతా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాం.’ అని ఆమె చెప్పింది.

watch video :