Ads
పిఆర్ఎస్ ఒబెరాయ్…ఇతని గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈయన సంస్థలు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త,భారత దేశ ఆతిథ్య రంగ దిగ్గజం, లగ్జరీ హోటళ్లు, ట్రైడెంట్ హోటల్స్ నిర్వహించే ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్. ఈయన పూర్తి పేరు పృథ్వి రాజ్ సింగ్ ఒబెరాయ్. తాజాగా 94 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.
Video Advertisement
మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్లు ఒబెరాయ్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. తమ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ తమను విడిచి వెళ్లారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని ఒబెరాయ్ గ్రూప్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఆయన మరణం ఒబెరాయ్ గ్రూప్‌తో పాటు భారత్ సహా విదేశీ ఆతిథ్య రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. పీఆర్ఎస్ ఒబెరాయ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. ఢిల్లీలోని పకషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫామ్‌లో అత్యక్రియలు జరగుతాయని వెల్లడించింది.పీఆర్ఎస్ ఒబెరాయ్ దూర దృష్టి గల నాయకుడని, అంకితభావం, పట్టుదలతో ఒబెరాయ్ గ్రూప్, హోటళ్లను ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతిగా తీర్చిదిద్దారని గ్రూప్ పేర్కొంది. పీఆర్ఎస్ ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్త రూపు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఒబెరాయ్ గ్రూప్ 1934లో ఏర్పాటైంది.
ఢిల్లీ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. 7 దేశాలలో 32 లగ్జరీ హోటళ్లు, 7 క్రూయిజ్ షిప్స్ ఒబెరాయ్ గ్రూప్స్ కి ఉన్నాయి.పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్ దేశానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా 2008 జనవరిలో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఒబెరాయ్ గ్రూప్ ను ప్రపంచంలోనే ప్రముఖ లగ్జరీ హోటళ్లలో ఒకటిగా అభివృద్ధి చేయడంలో పీఆర్ఎస్ ఒబెరాయ్ అసాధారణ కృషికి గానూ ది ఇంటర్నేషనల్ లగ్జరీ ట్రావెల్ మార్కెట్ (ILTM) 2012, డిసెంబర్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందించింది. అలాగే హోటల్స్ మ్యాగజైన్ 2010లో పీఆర్ఎస్ ఒబెరాయ్‌ని 2010 కార్పొరేట్ హొటెలర్ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తించింది గౌరవించింది. 150 కి పైగా దేశాల్లోని తమ రీడర్ల ఓటింగ్ ద్వారా పీఆర్ఎస్ ఒబెరాయ్‌ని ఎంపిక చేసింది.
Also Read:పది రోజులే ఉందంటూన్న బర్రెలక్క…. వీడియో వైరల్
End of Article