Ads
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యక రాష్ట్రం కోసం పోరాడి, సాధించడమే కాకుండా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై, ఎన్నో పథకాలు, ప్రాజెక్టులు తీసుకువచ్చారు.
Video Advertisement
కేసీఆర్ ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు వరుసగా ఎలెక్షన్స్ లో విజయం సాధించారు. అయితే కేసీఆర్ తొలిసారి పోటీ చేసిన ఎన్నికలలో ఆయన గురువుగా భావించే అనంతుల మదన్ మోహన్ చేతిలోనే ఓటమి చవి చూశారు. ఆ తరువాత నుండి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. అనంతుల మదన్ మోహన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, అనంతుల మదన్ మోహన్‌ను సీఎం కేసీఆర్‌కు రాజకీయ గురువుగా పిలుస్తారు. లాయర్ వృత్తి చేస్తూనే మదన్ మోహన్ అటు తెలంగాణ ఉద్యమంలో, ఇటు రాజకీయాలలో కొనసాగేవారు. స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో, కాంగ్రెస్‌లో కొనసాగిన కాలంలో కేసీఆర్ మదన్ మోహన్‌కు సన్నిహితంగా మెలిగేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తరువాత కేసీఆర్ ఆ పార్టీలో చేరారు. 1970 లో మదన్ మోహన్ సిద్దిపేట ఉప ఎన్నికలతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1967లో సిద్దిపేట ఎమ్మెల్యే వల్లూరి బసవరాజు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దాంతో ఆ సీటు ఖాళీ అయింది. 1970లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలెక్షన్స్ జరిగాయి. ఆ ఎలెక్షన్స్ లలో మదన్ మోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పీవీ రాజేశ్వరరావు పై మదన్ మోహన్ 31,633 ఓట్లతో గెలిచారు. ఆ తరువాత 1972, 1979 ఎలెక్షన్స్ లో కూడా అనంతుల మదన్ మోహన్ గెలుపు సాధించారు.
1983లో తొలిసారి పోటీ చేసిన కేసీఆర్ పై విజయం సాధించారు. పీవీ నరసింహారావు, భవనం వెంకట్రామిరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, టంగుటూరి అంజయ్యల మంత్రివర్గాలలో మదన్ మోహన్ పనిచేశారు. మంత్రిగా విద్యా శాఖ, రెవెన్యూ, ఆరోగ్య శాఖల లాంటి ముఖ్యమైన శాఖలకు పనిచేశారు.
తెలుగుదేశం పార్టీ 1983 ఎలెక్షన్స్ లో 200కి పైగా సీట్లు సాధించి, ఎన్టీఆర్ సీఎం అయ్యి, గవర్నమెంట్ ను ఏర్పాటు చేయగా, మదన్ మోహన్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తరువాత వచ్చిన 1985 ఎలెక్షన్స్ లో మదన్ మోహన్ పోటీ చేయలేదు. అనంతరం 1989, 1994 ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి సిద్దిపేటలోనే పోటీ చేయగా, రెండు సార్లు కూడా కేసీఆర్ చేతిలో పరాజయం పొందారు. ఆ తరువాత రాజకీయంగా కనుమరుగయ్యారు. 2004లో అనంతుల మదన్ మోహన్ కన్నుమూశారు.
End of Article