ప్రతి క్యూఆర్ కోడ్ లో మూడు స్క్వేర్ బాక్స్ లు ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు కారణం ఇదే..!

ప్రతి క్యూఆర్ కోడ్ లో మూడు స్క్వేర్ బాక్స్ లు ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు కారణం ఇదే..!

by Anudeep

భారత దేశం డిజిటల్ గా పయనిస్తున్న సంగతి తెలిసిందే. కరెన్సీ నోట్లకంటే.. డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పచారీ కొట్టు, రోడ్ సైడ్ పానీ పూరి షాపుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టి ప్లెక్స్ ల వరకు క్యూఆర్ కోడ్ తో కూడిన పేమెంట్ సదుపాయం అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంది.

Video Advertisement

qr code 2

ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో నగదు చెల్లించవచ్చు. చిల్లరతో పని ఉండదు. సమయం కూడా వృధా అయ్యే అవకాశం లేకపోవడంతో అందరు ఈ తరహా పేమెంట్స్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. మీరెప్పుడన్నా గమనించారా? ఈ క్యూర్ కోడ్ లో మూడు స్క్వేర్ బాక్స్ లు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అర్ధం. దీనిని తయారీ సమయంలో వాహనాలను ట్రాక్ చేసే ఉద్దేశ్యంతో జపనీస్ ఆటోమోటివ్ కంపెనీ 1994 లో కనిపెట్టింది.

qr code 1

సిస్టమ్ ప్రామాణిక బార్‌కోడ్‌లతో పోలిస్తే వీటిని త్వరగా ట్రాక్ చేయవచ్చు. QR కోడ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, మీ ఫోన్‌లో ఎలాంటి వెబ్ చిరునామాలను టైప్ చేయకుండా వారి వెబ్‌సైట్‌ను సులభంగా యాక్సెస్ చేయడం కోసం కెమెరా వంటి ఇమేజింగ్ పరికరాలకు అనుమతిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్ QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, అది ఆ సమాచారాన్ని మనుషులు సులభంగా అర్థం చేసుకునే విధంగా అనువదిస్తుంది. క్యూఆర్ కోడ్ లో వివిధ భాగాలు ఉంటాయి.

qr code 3

అవేంటంటే, క్వైట్ జోన్ (1), ఫైండర్ ప్యాట్రన్ (2), అలైన్మెంట్ ప్యాట్రన్ (3), టైమింగ్ ప్యాట్రన్ (4), వెర్షన్ ఇన్ఫర్మేషన్ (5), మరియు డేటా సెల్స్ (6). అయితే.. ఫైండర్ ప్యాట్రన్ జోన్ లోనే ఈ మూడు స్క్వేర్ బాక్స్ లు ఉంటాయి. వీటివల్ల క్యూఆర్ కోడ్ ను మన డివైజ్ వేగంగా చదవగలుగుతుంది. అది రివర్స్ లో ఉన్నాకూడా మనం స్కాన్ చేసినప్పుడు ఈజీ గా చదివేస్తుంది. ఈ మూడు స్క్వేర్ బాక్స్ కోడ్ యొక్క ధోరణి, పరిమాణం మరియు చేరాల్సిన గమ్యాన్ని గుర్తించడానికి దోహదం చేస్తాయి. నాలుగు స్క్వేర్ బాక్స్ లు నాలుగు వైపులా ఉంటె అప్పుడు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం కష్టతరమవుతుంది. అందుకే, మూడు బాక్స్ లు ఉండి.. రెండు పైనా, ఒకటి కింద డిజైన్ చేయబడి ఉంటాయి.


You may also like