Ads
జర్నీ చేసే సమయం లో కిటికీ పక్కన కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. అందులోను విమానం లో అంటే నిజం అందరికి అది ఒక డ్రీం లాంటిదే. ఎందుకంటే ఆకాశం లో ఎగురుతూ.. కిటికీలోంచి బయటకు చూడడం ఓ మంచి అనుభూతి. అయితే..
Video Advertisement
అలా వెళ్తున్నపుడు చాలా మంది గమనించే ఉంటారు. విమానం లో కిటికీలు బస్సులలోను, కార్లలోనూ, ట్రైన్స్ కి ఉన్నట్లు చదరంగం ఆకారం లో ఉండవు. రౌండ్ గా ఉంటాయి.. అయితే ఇలా ఎందుకు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

1950 ల వరకు విమానంలోని కిటికీలు చదరపు ఆకారంలో ఉండేవి. రెండు విమానాలు మిడ్-ఫ్లైట్ అక్షరాలా పడిపోయిన తరువాత, డిజైన్ లోపం త్వరగా గుర్తించబడింది. ఆ తరువాత ఈ సమస్యని పరిష్కరించారు. విమానాలలో స్క్వేర్ షేప్ లో ఉండే కిటికీలను అమర్చడం ప్రమాదకరం. ఎందుకంటే క్యాబిన్ లోపల మరియు వెలుపల ఉన్న ప్రెజర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

స్క్వేర్ షేప్ లో ఉండే కిటికీ కి కార్నర్ లు షార్ప్ గా ఉంటాయి. ఇవి ప్రెజర్ ని తట్టుకోలేవు. దాని వలన ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే రౌండ్ గా ఉండే కిటికీలు అయితే ఈ ప్రెజర్ ని బయటకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అందుకే స్క్వేర్ షేప్ లో ఉండే కిటికీల కంటే, రౌండ్ షేప్ లో ఉండే కిటికీలు ఎక్కువ బలం గా ఉంటాయి. అందుకే విమానాలలో కూడా కిటికీలను రౌండ్ షేప్ లో డిజైన్ చేస్తారు.
End of Article
