అల్యూమినియం ఫాయిల్ ని ఎప్పుడైనా గమనించారా..? ఒకవైపు మెరుస్తూ.. మరొక వైపు డల్ గా ఎందుకు ఉంటుంది?

అల్యూమినియం ఫాయిల్ ని ఎప్పుడైనా గమనించారా..? ఒకవైపు మెరుస్తూ.. మరొక వైపు డల్ గా ఎందుకు ఉంటుంది?

by Anudeep

Ads

మనం ఇంట్లో అల్యూమినియం ఫాయిల్ ని తరచుగా వాడుతూనే ఉంటాము. ఇంట్లో ఉన్న మిగిలిన పదార్ధాలను కవర్ చేయడానికి, ఒవేన్ లో పెట్టేముందు ఆహారపదార్ధాలను కవర్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ ని ఉపయోగిస్తూ ఉంటాము. మీరెప్పుడైనా గమనించారా..? అల్యూమినియం ఫాయిల్ కి ఒక వైపు మెరుస్తూ ఉంటె.. మరొక వైపు డల్ గా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

aluminium foil 1

అల్యూమినియం ఫాయిల్ ను కేవలం వంటగదిలోని కాదు.. ఎలక్ట్రానిక్ తయారీ వంటి ఇతర పరిశ్రమల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. అల్యూమినియం ఫాయిల్ రాకముందు.. ప్రజలు టిన్ రేకుని ఉపయోగించేవారు. ఆహారపదార్ధాలను కప్పి ఉంచడం కోసం వాడే ఈ టిన్ రేకు వల్ల ఉపయోగం కంటే ఇబ్బందులే ఎక్కువ ఉండేవి. ఈ రేకు కప్పినా ఆహరం పాడయ్యేది. అంతే కాదు.. రుచిలో కూడా మార్పు కనిపించేది. దీనికి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న టైంలో అల్యూమినియం ఫాయిల్ ను కనిపెట్టారు.

aluminium foil 2

టిన్ రేకు కంటే అల్యూమినియం ఫాయిల్ తక్కువ ఖరీదుకే వస్తుంది. దానితో క్రమంగా అల్యూమినియం ఫాయిల్ కు ఆదరణ పెరిగింది. దీనితో ఎక్కువ మొత్తం అల్యూమినియం ఫాయిల్స్ ను తయారు చేయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియలో కరిగిన అల్యూమినియం నుండి వేయబడిన అల్యూమినియం స్లాబ్‌లను రోలింగ్ మిల్లులో వేయడం ద్వారా ఎంత మందం లో కావాలో అంత మందంలో ఈ ఫాయిల్స్ ను పొందవచ్చు.

aluminium foil 3

ఈ ప్రక్రియను మిల్లింగ్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియ వల్లనే ఫాయిల్ యొక్క రెండు వైపులు భిన్నంగా ఉంటాయి. పలుచని ఫాయిల్ ను తయారు చేయడం కోసం రేకుని సాగదీస్తారు. ఇందుకోసం ఎక్కువ మొత్తం లో ఉష్ణానికి గురి చేస్తారు. ఈ క్రమంలో రేకు విచ్ఛిన్నం అవ్వకుండా ఉండడానికి రెండు పొరలను కలిపి, గట్టిగా నొక్కి పట్టి ఉంచుతారు. రెండు పొరలను ఒకేసారి మిల్లింగ్ చేస్తారు. ఈ క్రమంలో ఒక వైపు డైరెక్ట్ గా మిల్లింగ్ చేయబడుతుంది. మరొక వైపు రెండో పొరకు అతుక్కుని ఉంటుంది. ఇలా రెండో పొరకు అతుక్కుని ఉన్న వైపు డల్ గాను, డైరెక్ట్ గా మిల్లింగ్ చేయబడిన వైపు షైనింగ్ గాను ఉంటుంది.


End of Article

You may also like