మన కరెంటుకు అమెరికాలో సప్లై చేసే కరెంటుకి ఈ తేడా ఎందుకు ఉంటుందో తెలుసా?

మన కరెంటుకు అమెరికాలో సప్లై చేసే కరెంటుకి ఈ తేడా ఎందుకు ఉంటుందో తెలుసా?

by Anudeep

Ads

అమెరికా మరియు ఇతర దేశాల మధ్య చాలా విషయాలలో చాలా కాలంగా వ్యత్యాసాలు ఉంటూ వస్తున్నాయి. అయితే భారత్ తో సహా ప్రపంచ దేశాలు వాడే కరెంటుకు.. అమెరికా వాడే కరెంటుకు చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఈ వ్యత్యాసం ఎందుకు ఉంటుంది?

Video Advertisement

అమెరికాలో ఉపయోగించే కరెంటుకు భారత్ వంటి ఇతర దేశాలు ఉపయోగించే కరెంటు వేరుగా ఉంటాయి అన్న సంగతి తెలియదు. అయితే.. ఇలా ఎందుకు తేడా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విషయం తెలియాలి అంటే.. ముందు కరెంటు వాడకంలో కొన్ని కీలక విషయాలు తెలిసి ఉండాలి. ఎక్కువ వోల్టేజి కరెంటు పాస్ అవుతున్నప్పుడు.. విద్యుత్ పరికరాలలో వాడే ఆవాహకాలు మేలు రకానివి అయ్యుండాలి. లేకపోతే వాటిని వినియోగిస్తున్న సమయంలో షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మంచి విద్యుత్ వాహకాలు అందుబాటులో లేవు. అదీకాకుండా అప్పట్లో కేవలం లైట్లు వెలిగించడం కోసమే విద్యుత్ వాడేవారు.

us plugs

అయితే.. ప్రస్తుతం ఇతర అవసరాల కోసం కూడా విద్యుత్ ను వాడాల్సి వస్తోంది. ఒకప్పుడు కేవలం 110 వోల్ట్ కరెంటును మాత్రమే వినియోగించే వారు. కానీ, ప్రస్తుతం.. వాహకాలు కూడా అభివృద్ధి చెందడంతో ఈ వోల్టేజీని పెంచి వినియోగిస్తున్నారు. మొదట ఐరోపాలో విద్యుత్ వాడకం పెరిగాక.. 230 /240 వోల్టుల విద్యుత్ ను ఎంచుకున్నారు. ఈ వోల్టేజి దగ్గర మేలు రకం వాహకాలు బాగా పని చేస్తుండడంతో భారత్ తో సహా ఇతర దేశాలు కూడా ఈ వోల్టేజీని వినియోగిస్తున్నాయి. అయితే.. అమెరికా మాత్రం 110 వోల్ట్ కరెంటునే కొనసాగించింది. అయితే.. ఇప్పుడిప్పుడే అమెరికాలో కూడా మార్పు వస్తోంది. కొత్త ఇంటికి 240 వోల్ట్ కరెంటును సప్లై చేస్తున్నారు. కానీ, అన్ని ప్రాంతాలలోను ఇది ఇంకా అమలు కాలేదు.


End of Article

You may also like