ఆస్ట్రోనాట్లు ఆ కలర్ స్పేస్ సూట్ లనే ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

ఆస్ట్రోనాట్లు ఆ కలర్ స్పేస్ సూట్ లనే ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

by Anudeep

Ads

మనం ఆస్ట్రోనాట్లను ఊహించుకోగానే మొదట గుర్తొచ్చేది వారు ధరించే స్పేస్ సూట్స్. అవి ఎక్కువగా తెలుపు లేదా ఆరంజ్ రంగులలో కనిపిస్తాయి. గతంలో కొంతమంది పసుపు రంగు స్పేస్ సూట్ ని కూడా ధరించారు. కానీ ప్రస్తుతం ఆస్ట్రోనాట్లు ఎక్కువగా తెలుపు, ఆరంజ్ రంగు స్పేస్ సూట్ లనే ధరిస్తున్నారు.

Video Advertisement

మరి మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా..? వారు తెలుపు, ఆరంజ్ రంగుల్లో ఉండే స్పేస్ సూట్లనే ఎందుకు ధరిస్తారు..? ఒకసారి నాసా మాజీ వ్యోమగామి క్రిస్ ఫెర్గూసన్ నీలి రంగులోని స్టార్‌లైనర్ సూట్‌ను ధరించారు.

austronauts 1

అయితే అది స్పేస్ క్రాఫ్ట్ లోపల పరిశోధనకు మాత్రమే పరిమితమైంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు మాత్రం ఎక్కువగా తెలుపు, ఆరంజ్ రంగుల్లో ఉండే స్పేస్ సూట్ లనే ధరిస్తున్నారు. కేవలం ఈ రంగుల్లో ఉండే స్పేస్ సూట్ లనే ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరంజ్ సూట్ ని అడ్వాన్స్‌డ్ క్రూ ఎస్కేప్ సూట్ అని పిలుస్తారు. ఇంకా పంప్కిన్ సూట్ (గుమ్మడి రంగు) అని కూడా సంబోధిస్తూ ఉంటారు.

austronauts 2

ఇది ప్రెజర్ సూట్ గా వ్యవహరించబడుతుంది. అంతరిక్షంలో గాలి ఎక్కువగా లేని ప్రాంతాలకు వెళ్లే సమయంలో, ప్రెజర్ తక్కువగా ఉండే ఎత్తుకు వెళ్లే పైలట్లకు ఒత్తిడితో కూడిన సూట్‌లు అవసరం అవుతాయి. అందుకే వారు పాక్షిక-పీడన సూట్‌ను ధరిస్తారు. అయితే అంతరిక్ష సిబ్బంది మాత్రం పూర్తి-పీడన సూట్‌ను ధరిస్తారు.

austronauts 3

వ్యోమనౌక ప్రయోగించే సమయంలో లేదా ల్యాండింగ్ సమయంలో ప్రమాదాల నుండి వారిని రక్షించేందుకు, వారిని గుర్తించేందుకు వీలుగా ఉండడానికి ఆరంజ్ రంగు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోనే రేడియో, ఫ్లేర్స్, సర్వైవల్ గేర్ తో పాటు మెడిసిన్స్, పారాచూట్ తో పాటు మరికొన్ని ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటుంది. స్పేస్ లో ఉన్నప్పుడు ఆరంజ్ మరియు తెలుపు రంగులను గుర్తించడం, వెంటనే వారిని గుర్తించి కాపాడడం తేలిక అవుతుంది. అందుకే ఈ రంగులని ధరిస్తారు.

austronauts 4

తెలుపు రంగు సూట్లను ధరించడానికి మరో కారణం కూడా ఉంది. తెలుపు రంగు సూట్ లను EVA సూట్ అని పేర్కొంటారు. తెలుపు రంగు ఇతర రంగుల కంటే ఎక్కువ వేడిని ప్రతిబింబిస్తుంది. వ్యోమగామి అంతరిక్షంలో ఎక్కువ ఉష్ణానికి గురి అవకుండా ఉంటారు. చల్లని ప్రాంతాలలో వారికి వెచ్చదనాన్ని ఇవ్వడానికి వారి గ్లౌజ్ లలో హీటర్లు ఉంటాయి. అవి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తూ ఉంటాయి. ఇక సూట్ వల్ల అసౌకర్యం లేకుండా వ్యోమగామికి చల్లదనం కూడా ఉంటుంది. స్పేస్ లో ఎక్కువ డార్క్ గా ఉంటుంది. ఆ సమయంలో తెలుపు రంగుని గుర్తించడం కూడా తేలిక అవుతుంది.


End of Article

You may also like