బెంగాల్ లో కాళీ మాతకు చేపలు, మాంసాన్ని ఎందుకు నివేదిస్తారో తెలుసా? అసలు కారణం ఇదే!

బెంగాల్ లో కాళీ మాతకు చేపలు, మాంసాన్ని ఎందుకు నివేదిస్తారో తెలుసా? అసలు కారణం ఇదే!

by Anudeep

Ads

బెంగాల్ అంతటా వందలాది కాళీ దేవాలయాలు ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్క దేవాలయానికి అసంఖ్యాక పురాణాలు ఉన్నాయి. కానీ తూర్పు రాష్ట్రంలో కాళీ ఆరాధన విషయంలో మాత్రం కొన్ని స్థిరమైన ఆచారాలను అమలు పరుస్తూ వస్తున్నారు. వాటిల్లో ఒకటి దేవతకు మాంసాహారం నివేదించడం.

Video Advertisement

బెంగాల్ సాంస్కృతిక ఉనికిలో “కాళీ పురాణానికి” మంచి ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఆమెను ఉగ్ర దేవత, రాక్షసులను సంహరించే దేవతగా భావిస్తుంటారు.మరికొందరు ఆమెను తల్లిగా, సొంత కుటుంబ సభ్యురాలిగా భావిస్తుంటారు. తూర్పు రాష్ట్రంలోని కాళీ దేవాలయాలలో కొన్ని ప్రత్యేక సంప్రదాయాలను చూడవచ్చు. ముఖ్యంగా కాళీఘాట్, తారాపీఠ్ లేదా దక్షిణేశ్వర్ వంటి దేవాలయాలలో ఈ సంస్కృతి మనకి కనిపిస్తూ ఉంటుంది.

goddess kali 1

కాళీఘాట్, కోల్‌కతా: దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటిగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ జంతుబలి జరుగుతుందని అక్కడి ఆలయ పూజారులు చెబుతుంటారు. అక్కడి భక్తులు అమ్మవారికి మొక్కుకుని జంతుబలి ఇవ్వడం అక్కడ సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఆ తరువాత ఆ మాంసాన్ని వండి అక్కడి భక్తులకు ప్రసాదంగా పెడుతుంటారు. ఇక్కడి కాళీదేవికి మాత్రం శాఖాహారమే నివేదిస్తారు. జంతుబలి ద్వారా వచ్చిన మాంసాహారాన్ని డాకిని, యోగిని దేవతలకు అర్పిస్తారు.

goddess kali 2

బెంగాల్‌లోని మరో శక్తిపీఠం తారాపీఠ్, బీర్భూమ్ వద్ద ఉంది. ఇక్కడి ఆలయ పూజారులు చెప్పిన వివరాల ప్రకారం చేపలు మరియు మాంసాన్ని అమ్మవారికి నివేదిస్తారట. ఇది కాకుండా, ప్రత్యేక శాఖాహారం మరియు పండ్ల నివేదన కూడా చేస్తారట. అలాగే… శ్రీరామకృష్ణుల దక్షిణేశ్వరాలయంలో అమ్మవారికి ప్రతిరోజూ భోగ్ రూపంలో చేపలు సమర్పిస్తారు. అయితే ఇక్కడ జంతువులను బలి ఇవ్వరు. ఉత్తర కోల్‌కతాలోని 300 ఏళ్ల నాటి తాంథానియా కాళీ ఆలయంలో, చేపలు లేకుండా అమ్మవారికి నివేదన పూర్తి కాదు. ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి మొక్కుకున్న భక్తులు మాంసాన్ని నివేదిస్తుంటారు. అయితే.. ఆలయంలో జంతుబలులు మాత్రం చేయరు.

goddess kali 3
ఇలా బెంగాల్ లోని చాలా దేవాలయాలలో అమ్మవారికి చేపలను, మాంసాన్ని నివేదిస్తున్నారు. భక్తులు అమ్మవారికి మొక్కుకోవడం అనే ఆచారం అనాదిగా వస్తోంది. భక్తులు తమ కోర్కెలు తీరిన తర్వాత బలి ఇచ్చిన జంతువును అమ్మవారికి సమర్పిస్తారు. భక్తులు అమ్మవారికి భక్తితో దేనిని సమర్పిస్తే.. దానినే అమ్మవారికి నివేదిస్తుంటారు. “తంత్ర సాధనలో, మద్యం మరియు మాంసం ఇచ్చే పద్ధతి ఉంది. తాంత్రిక తత్వశాస్త్రం యొక్క అటువంటి అభ్యాసాలలో మునిగిపోయే వారు మాత్రమే అలాంటి పద్ధతుల గురించి చెప్పగలుగుతారని, ఆ అభ్యాసాలలో ఉండడం వల్లే అమ్మవారికి చేపలు, మాంసం సమర్పించే సంప్రదాయం వచ్చింది” అని పండితులు చెబుతుంటారు.


End of Article

You may also like