Ads
మీరు ఎప్పుడైనా గమనించారా..?.. చాలా మంది అమ్మాయిలు తమ కాలికి నల్ల దారం కట్టుకుని ఉంటారు. ప్రస్తుతం ఎక్కువ మంది అమ్మాయిలే కట్టుకుంటున్నారు. కొందరు అబ్బాయిలు కూడా కట్టుకుంటున్నారు. అయితే, ప్రెజెంట్ ఇది ట్రెండింగ్ అవుతున్నా, దీని వెనక మన పెద్దల దూరాలోచన కూడా ఉంది. అదేంటో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. చాలా మంది వీటిని ఎందుకు కట్టుకుంటున్నారో తెలీకుండానే కట్టుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు కట్టుకుంటున్నారు. వీటి వెనక శాస్త్రీయ కారణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం…
Video Advertisement
ఈ మధ్య ఈ దారాలకు పూసలు, మువ్వలు కూడా జత చేసి కట్టుకుంటున్నారు. తొలుత దీనికి ఆకర్షితులై కట్టుకుంటున్నా.. దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నల్ల దారం కట్టుకోవడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ గా అనిపిస్తున్నా, భారత్ లో ఇది ఎప్పటినుంచో ఉంది. పసిపిల్లలు గా పుట్టినప్పటి నుంచే తల్లులు పిల్లల కు మొలతాడు గా కట్టడం భారత్ లో అనాది గా వస్తున్న సంప్రదాయం. నలుపు రంగు త్వరగా ప్రతికూల శక్తిని గ్రహించగలదు. అందుకే చిన్నపిల్లలకు కూడా దిష్టి తగలకూడదని నలుపు రంగు బొట్టుని పెడతారు. అలాగే, బుగ్గన చుక్క కూడా నలుపు రంగుదే పెడతారు.
ఈ క్రమం లో పాదం పైన, మణికట్టు వద్ద, నడుము, మెడ వంటి భాగాలలో కూడా నల్ల దారాన్ని కడతారు. కొందరు ఈ నల్లదారాన్ని మొలతాడు గా కూడా కడతారు. నడుముకి కట్టడం ద్వారా పొట్ట పెరగకుండా ఉంటుందని, నడుము భాగం నియంత్రించబడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.అలాగే, ఇలా నల్ల దారం కట్టుకోవడం వలన వెన్ను నొప్పి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే, సంతానోత్పత్తి కి కూడా మేలు జరుగుతుందట.
నల్ల దారం వలన పునరుత్పత్తి అవయవాలు చల్లగా ఉండి సంతాలేమి సమస్యలు ఏమైనా ఉంటె అవి దూరం అవుతాయట. అందుకే మన పెద్దలు పూర్వం నుంచే చిన్న వయసులో ఉన్న పిల్లలకు నల్ల దారం కట్టి అలవాటు చేస్తారు. ఈ ఆచారం ఇపుడు ట్రెండింగ్ లో ఉంది. కానీ., మన పెద్దలు ఇంతకుముందే మన మంచి కోరి మనకు ఎన్నో మంచి అలవాట్లు చేసారు.
End of Article