కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేసినపుడు పాలు పొంగిస్తారు.. ఎందుకో తెలుసా..?

కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేసినపుడు పాలు పొంగిస్తారు.. ఎందుకో తెలుసా..?

by kavitha

Ads

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అది చిన్న ఇల్లు అయినా లేదా కోట్లు పెట్టి కట్టించుకున్న ఇల్లు అయినా సరే ఎవరి ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టుగా వారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఇంటి కోసం కలలు కంటారు. తమ కల సాకారం అయ్యి, సొంత ఇంట్లోకి  అడుగు పెట్టడం అనేది ఎవరికైనా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

Video Advertisement

కొత్త ఇంట్లో గృహ ప్రవేశానికి శుభ సమయాన్ని ఎంచుకుంటారు. ఇక గృహప్రవేశం చేసిన సందర్భంలో తప్పనిసరిగా ఆ ఇంటి ఆడపడుచులు ఇంట్లో పాలు పొంగిస్తూ ఉంటారు. అయితే గృహ ప్రవేశం చేసినపుడు పాలు ఎందుకు పొంగిస్తారో ఇప్పుడు చూద్దాం..

గృహ ప్రవేశం చేయడం అనేది హిందూ సంప్రదాయం. కొత్త ఇంట్లోకి వెళ్లడానికి ముందుగా గృహ ప్రవేశ పూజను శుభ సమయంలో నిర్వహిస్తారు. ఇంటి పర్యావరణ శుద్ధి మరియు ప్రతికూల శక్తుల నుండి గృహాన్ని రక్షించడానికి తొలిసారిగా కొత్త ఇంట్లోకి మారినప్పుడు గుహ ప్రవేశ పూజా చేస్తారు.  గృహ ప్రవేశ వేడుకలో పాలు పొంగించడానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

కొత్త ఇంట్లో మొదటిసారి పొయ్యి వెలిగించి కొత్త పాత్రలో పాలను పొంగించడం అనేది హిందూ సంప్రదాయం మరియు ఆచారంలో అంతర్భాగం. హిందూ విశ్వాసాల ప్రకారంగా గృహ ప్రవేశ శుభ తరుణంలో పాలు పొంగించినట్లయితే ఆ గృహంలో సుఖ సంతోషాలు కూడా పాలవలే పొంగుతూ ఉంటాయని నమ్ముతారు.  ఈ పాలతోనే క్షీరాన్నం కూడా తయారు చేస్తారు.

పొంగిన పాలలోనే బియ్యం మరియు బెల్లం వేసి క్షీరాన్నం  చేస్తారు. ఈ క్షీరాన్నంను దేవతలకు నైవేద్యంగా పెడతారు. ఆ తరువాత దానిని ప్రసాదంగా అందరికీ పంచుతారు. గృహప్రవేశంలో పాలు పొంగిచడం వల్ల అలాగే ఆ ఇంటి మీద, ఇంటి సభ్యుల మీద దేవుని ఆశీస్సులు ఉంటాయని విశ్వసిస్తారు. అలాగే ఆ గృహంలో సంతోషం, శ్రేయస్సు మరియు శాంతి కలుగుతుందని విశ్వసిస్తారు. అందువల్ల కొత్త ఇంట్లోకి వెళ్ళే సమయంలో వంటగదిలో కొత్త పాత్రలో తప్పనిసరిగా పాలు పొంగిస్తారు.

Also Read: ఈ “కోట” వల్ల అప్పుల పాలు అయ్యారా..? అసలు ఎందుకు కట్టారు..?

 


End of Article

You may also like