Ads
ఇటుకలు మనందరికీ తెలిసినవే.. రెక్ట్యాంగిల్ షేప్ లో ఉండి..ఒకే రకమైన ప్రామాణిక కొలతలతో వీటిని తయారు చేస్తారు. వీటిని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ల లో వినియోగిస్తారు. అయితే, వీటిని వాడే ముందు కచ్చితం గా నీటిలో కొంత సమయం పాటు నాననిచ్చి ఆ తరువాత గోడలు కట్టే సమయం లో ఉపయోగిస్తారు.. ఇలా ఎందుకు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
ఏదైనా ఒక బిల్డింగ్ ని కట్టాలంటే ఇటుకలు తప్పనిసరి. గోడలు కట్టాలంటే..ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ రావాలి . ఆ పై సిమెంట్ తో ఆ ఇటుకలను పూడ్చి ఫినిషింగ్ చేయాలి. తాపీ పని వారు ఇటుకలను మోర్టార్ (సిమెంట్ + ఇసుక + నీరు) సహాయంతో గోడను నిర్మిస్తారు. ఈ మోర్టార్ తయారు చేసిన రకం, ఇటుక నాణ్యత మీద గోడ బలం ఆధారపడి ఉంటుంది. అయితే, ఇలా గోడను కట్టేముందు ఇటుకలను పూర్తి నీటిలో నానబెడతారు. అవి మునిగే వరకు నీటిని పోసి కొంత సేపు వదిలేస్తారు.
ఇటుకలు పోర్స్ ని కలిగి ఉంటాయి. ఈ పోర్స్ మధ్య గాలి ఉంటుంది. అంతే కాదు ఈ ఇటుకలు తేమని గ్రహించగలుగుతాయి. అందుకే వీటిని ముందు నానపెడతారు. నీటిలో ఉంచినప్పుడు గాలి బయటకు విడుదల అయ్యి..ఈ ఇటుకలు నీటిని పీల్చుకుంటాయి. ఆ తరువాత వీటిని నిర్మాణం లో ఉపయోగించినప్పుడు ఇటుకలను పేర్చిన తరువాత పైన మోర్టార్ తో కోటింగ్ వేస్తారు.
ఈ ఇటుకలు ఆల్రెడీ నీటిని పీల్చేసుకుని ఉంటాయి కాబట్టి మోర్టార్ లో ఉన్న నీటిని పీల్చుకోవు. ఒకవేళ ఈ ఇటుకలను నీటిలో నానబెట్టకుండా ఉపయోగిస్తే, పైన మోర్టార్ తో కోటింగ్ వేయగానే మోర్టార్ లోని తడిని ఇటుకలు పీల్చేసుకుంటాయి. ఫలితం గా మోర్టార్ లో బలం లేకపోవడం వలన, గోడ బలం గా ఉండదు.
అందుకే, ఇటుకలను తప్పనిసరిగా ఉపయోగించే ముందు నీటిలో ఉంచాలి. అప్పుడే మోర్టార్ కు, ఇటుకలు మధ్య బలం కుదిరి గోడ దృఢం గా ఉంటుంది. గాలి బబ్లింగ్ ముగిసే వరకు ఇటుకలను నానబెట్టి ఉంచాలి. కనీసం పన్నెండుగంటల వరకు ఈ ఇటుకలని నానబెట్టి ఉంచాలి. అప్పుడే ఆ ఇటుకలతో కట్టిన గోడ బలం గా ఉంటుంది.
End of Article