Ads
చాలా మంది ఎద్దులకు ఎరుపు రంగు అంటే గిట్టదని.. ఆ రంగుని చూడగానే కొమ్ములతో పొడవడానికి ముందుకు ఉరుకుతాయని చెబుతుంటారు. ఇందులో నిజానిజాలు తెలియకుండానే చాలా మంది ఈ మూఢనమ్మకాలను విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.
Video Advertisement
మనుషులకు కొన్ని కొన్ని రంగులు ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగు అంటే ఇష్టం ఉంటుంది. వారి ఆ రంగుల మధ్య వ్యత్యాసం తెలుస్తుంది, అవి అన్ని కనిపిస్తూ ఉంటాయి కాబట్టే మనుషులకి రంగులంటే ఇష్టం ఉంటుంది.
కానీ అన్ని జంతువులకు అన్ని రకాల రంగులు కనిపించవు. అన్ని రకాల రంగులను జంతువులు గుర్తించలేవు. ఎద్దులకు అసలు ఎరుపు రంగు కనిపించదు. ఆ రంగు ఎద్దులకి బూడిద, పసుపు కలిపిన రంగులాగా కనిపిస్తుంది. మనం నరసింహ సినిమాలో చూసే ఉంటాం. సౌందర్య గారు ఎరుపు రంగు చీర కట్టుకుంటే.. ఆమె వెనకాల ఓ ఎద్దు పరిగెడుతూ వస్తుంది.
అదే టైం లో.. రజినీకాంత్ గారు పరుగెత్తుకుంటూ వెళ్లి సౌందర్య పై పసుపు నీటిని పోస్తారు. దానితో ఎద్దు పక్కకి తప్పుకున్నట్లు చూపిస్తారు. కానీ ఇదంతా రియాలిటీలో జరగదు. ఎందుకంటే ఎద్దులకి అసలు ఎరుపు రంగే కనిపించదు. ఆ ఎరుపు రంగు పసుపు-బూడిద రంగు మిశ్రమ వర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఆ ఎద్దు యజమాని ఆ వస్త్రాన్ని ఊపే విధానం వలన ఎద్దుకు కోపం వస్తుంది. అందుకే అది కాళ్ళు రువ్వుతూ ఉంటుంది. ఈ అసలు విషయం తెలియని వారు ఎద్దుకు ఎరుపు రంగుని చూడడం వలన కోపం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు.
End of Article