కార్ డోర్ హ్యాండిల్ పై లాక్ పక్కన ఉండే ఈ “బటన్” గమనించారా.? అది ఎందుకు ఉంటుంది.?

కార్ డోర్ హ్యాండిల్ పై లాక్ పక్కన ఉండే ఈ “బటన్” గమనించారా.? అది ఎందుకు ఉంటుంది.?

by Anudeep

Ads

మీరు సరిగ్గా గమనించి ఉంటె కారు డోర్ పై చిన్న బటన్ ఉంటుంది. ఎపుడైనా చూసారా? ఈ చిన్న బటన్ అసలు ఎందుకు పనికి వస్తుందో మీకు తెలుసా..? ఈ బటన్ ఉపయోగాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ ఆర్టికల్ ని పూర్తి గా చదవండి.

Video Advertisement

ఆటోమోటివ్ రంగం లో ఈ మధ్య కాలం లో మరింత పురోగతి కనిపిస్తోంది. ఆటోమొబైల్ కంపెనీ లు కూడా తమ తమ కస్టమర్ల సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలని భావిస్తున్నాయి. ఈ క్రమం లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత గా అభివృద్ధి చేస్తున్నాయి. కస్టమర్ల కు సౌలభ్యం గా ఉండడం కోసమే కార్ హేండిల్ కి పైన చిన్న బటన్ ను ఇస్తారు. ఈ బటన్ ను రిక్వెస్ట్ స్విచ్ లేదా రిక్వెస్ట్ సెన్సార్ అని పిలుస్తారు. ఈ బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా మీకు కార్ డోర్ ను లాక్ చేయడం లేదా, తెరవడం తేలిక అవుతుంది. మీరు కీ ను తీసుకెళ్లినప్పుడు కూడా, ఈ బటన్ సాయం తో డోర్ ని లాక్ చేయొచ్చు.

అంతే కాదు, మీరు కీ ని ఉపయోగించకుండానే ట్రంక్ ను తెరవడం మూసివేయడం చేయవచ్చు. మీ కార్ కీ కి ఉండే రిమోట్ సెన్సెర్ ద్వారా డోర్ ని తెరవచ్చు. కీ ని చొప్పించకుండా, మీరు ఇంజిన్ ను స్టార్ట్ చేయవచ్చు. మీరు కీ సాయం తో మీ కారు ఎక్కడ ఉందొ చూడచ్చు. ఈ బటన్ కి ఉండే సెన్సెర్ సిగ్నల్ లా పని చేసి కీ ని ప్రెస్ చేసినపుడు సిగ్నల్ ను గ్రహించి స్పందిస్తుంది. అలాగే, డోర్ ని అన్ లాక్ చేస్తుంది. సో, మీరు ఎక్కువ సమయం వృధా చేయకుండా గమ్యానికి చేరుకోవచ్చు.

అసలు ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది అంటే.. ఇంటెలిజెంట్ కీ కారు మరియు కీ మధ్య సంకేతాలను ప్రసారం చేసే యాంటెన్నాలను మరియు సంకేతాలను స్వీకరించే ట్యూనర్‌ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుంది. రిక్వెస్ట్ స్విచ్ నొక్కడం కారు యాంటెన్నా నుండి సిగ్నల్ ను ప్రసారం చేస్తుంది మరియు సిగ్నల్ అందుకున్న కీ స్వయంచాలకంగా సిగ్నల్ ను తిరిగి ఇస్తుంది. కార్ ట్యూనర్ ఈ సిగ్నల్‌ను స్వీకరించి, ఆపై వాహనాన్ని లాక్ లేదా అన్‌లాక్ చేస్తుంది.

ఒకవేళ మీరు కారు క్యాబిన్ లోపల ఒక కీ లాక్ చేయకుండా ఉండాలనుకుంటే, తలుపు లేదా తాళం మూసివేయబడిన సమయంలో తలుపు లాక్ చేసే ఉందొ లేదో అన్న విషయాన్నీ ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. అదే, ఒకవేళ కార్ లోపల ఒక కీ మూసి ఉంటె బజర్ ద్వారా ఈ పరికరం మీకు హెచ్చరిక చేస్తుంది. అదే సమయం లో సొంతం గా కారు డోర్ ను అన్ లాక్ చేసేస్తుంది. అలాగే, దీని ద్వారా కారు టచ్ సెన్సిటివ్ డోర్ లాక్‌లను ఇన్‌స్టాల్ చేసిందో లేదో కూడా మీరు త్వరగా తెలుసుకోవచ్చు. డ్రైవర్ డోర్ దగ్గర హ్యాండిల్ లేదా లాక్ కనిపించకపోతే, కారులో టచ్ సెన్సిటివ్ లాక్ ఉందని మనకి యిట్టె అర్ధం అయిపోతుంది.


End of Article

You may also like