Ads
మన చుట్టాలో.. లేక మనకు దగ్గరివారో చనిపోతే మనకు అంతులేని దుఃఖం కలుగుతుంది. మనకి మనం సర్దిచెప్పుకోలేకపోతాము. మనకు ఇష్టమైన వారు మరణిస్తే ఆ బాధ చెప్పనలవి కాదు. వారి మృతదేహాన్ని చూస్తుంటేనే భోరున విలపిస్తాము.
Video Advertisement
మన కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే.. ఇక ఆ బాధ చెప్పాలనలవి కాదు. వారు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయాక వారి వస్తువులు, దుస్తులు.. ఇవన్నీ మనకి వారిని గుర్తు చేస్తూనే ఉంటాయి.
అయితే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదు అని.. వారి వస్తువులను, వారికీ సంబంధించిన వాటిని ఇంట్లో ఉంచకూడదు అని నమ్ముతూ ఉంటారు. వారి వస్తువులను ఎవరికైనా ఇచ్చివేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఇందులో నిజమెంత..? శాస్త్రం లో ఇలా చెప్పారా..? అని చాలా మందికి సందేహాలు వస్తూనే ఉంటాయి.
మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచి కోరే అయ్యుంటుంది. మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను దానం చేయడం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, మనం వారితో అనుబంధాన్ని మానుకోవాలి అని మన మనసుకి తెలియ చెయ్యడం. తద్వారా మనం జీవితంలో ముందుకు సాగాలి. వారి జీవిత ప్రయాణం మనతో ముగిసిందని మరియు ఇప్పుడు వెళ్లిపోయిన వారి ఆత్మ మనల్ని మరచిపోయి వారి తదుపరి పునర్జన్మకు వెళ్లాలని చెప్పడమే దీని వెనుక ఉద్దేశ్యం.
ఇది నిజంగా బాధాకరమైనదే. కానీ.. మనకు ఎంత ఇష్టమైనా.. వారు భౌతికంగా లేనపుడు.. వారి దుస్తుల్ని ధరించడం.. వారి వస్తువులను వాడుకోవడం వలన వారిని మనం పదే పదే తలుచుకుంటూ ఉన్నట్లు అవుతుంది. తద్వారా మనతో పాటు మన చుట్టూ ఉండే ఇతర కుటుంబ సభ్యులను కూడా మానసికంగా డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే వాటిని వద్దని చెప్పేవారు. అంతేకాకుండా.. వారి వస్తువుల్లో ఉండే సూక్ష్మ ప్రతికూల శక్తులు.. వారి దుస్తుల్ని, వస్తువుల్ని వదిలేయడం లేక మరొకరికి దానం చేసేయడం వలన.. వారికి సంబంధించిన ప్రతికూల శక్తులు మనలని విడిచి వెళ్లిపోతాయి. ఆ వ్యక్తి పూర్తిగా ఈ లోకం నుంచి దూరం అయ్యి మరు జన్మలో తన జీవితాన్ని తాను గడుపుతాడు.
End of Article