ఛార్జింగ్ కేబుల్స్ ఎందుకు చిన్నగా ఉంటాయి? దీని వెనుక అసలు కారణం ఇదే..!

ఛార్జింగ్ కేబుల్స్ ఎందుకు చిన్నగా ఉంటాయి? దీని వెనుక అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి ఎవరు ఉండడం లేదు. ఇంటర్నెట్ వినియోగం కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువగా నడుస్తోంది. వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్స్ వచ్చిన తరువాత ఫోన్ వాడకం మరింత పెరిగింది. ఫోన్ వాడాలి అంటే అందులో కచ్చితంగా ఛార్జింగ్ ఉండాలి కదా మరి. అక్కడే వస్తుంది సమస్య. ఎంత బాటరీ బ్యాక్ అప్ ఉన్న ఫోన్ అయినా ఎప్పుడో ఒకప్పుడు బాటరీ ఛార్జ్ అయిపోక తప్పదు.

Video Advertisement

charger 1

తిరిగి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మన వద్ద సూటబుల్ ఛార్జింగ్ కేబుల్ ఉండాలి. అయితే ఈ ఛార్జింగ్ కేబుల్స్ పెద్ద లెంగ్త్ ఉండవు. కనీసం అర మీటరు నుంచి మీటరు పొడవు వరకు ఉంటాయి. దీనితో మనకి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఛార్జింగ్ లో పెట్టిన తరువాత ఫోన్ పెట్టుకోవడానికి దగ్గరలోనే ఏదైనా టేబుల్ లాంటిది ఉండాల్సి ఉంటుంది. కింద వరకు పెట్టడానికి కేబుల్ సరిపోదు.

charger 2

మనం ఫోన్ ని ఛార్జ్ లో పెట్టి ఓ పక్కన కూర్చుని చూసుకుందామన్నా కూడా ఈ కేబుల్ అంత దూరం రాదు. ఛార్జింగ్ కేబుల్ లెంగ్త్ చిన్నదిగా ఉండడం వలన మనం దానిని పట్టుకుని అక్కడే ఎక్కువ సేపు కూర్చోలేము. తద్వారా మనం ఫోన్ వాడకాన్ని కూడా తగ్గిస్తాము. ఛార్జ్ పెడుతున్న టైంలో ఫోన్ వాడకం మంచిది కాదు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

# స్మార్ట్ ఫోన్ కు ఛార్జ్ పెడుతున్న టైం లో ఎక్కువ మొత్తం లో SAR రేడియేషన్ ఎనర్జీ విడుదల అవుతూ ఉంటుంది. దీని నుంచి రక్షించడం కోసం ఎక్కువ సేపు ఫోన్ వద్ద ఉండకుండా ఉండడానికి కేబుల్స్ ను చిన్నవిగా డిజైన్ చేసారు.

charger 3

# చార్జర్ కేబుల్ పెద్దదిగా ఉన్నపుడు కరెంటును పాస్ చేయడానికి ఎక్కువ రెసిస్టన్స్ అవసరమవుతుంది. దీనివల్ల విద్యుత్ చలనం తగ్గిపోతుంది. ఫలితంగా ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే, కేబుల్ లెంగ్త్ పెరగడం వల్ల కరెంట్ పాసేజ్ తగ్గుతుంది.

# ఈ మధ్య వచ్చే అన్ని ఛార్జర్లు USB పోర్ట్ తో వస్తున్నాయి. తద్వారా మనం అడాప్టర్ లేకపోయినా.. ఈ కేబుల్ ను డైరెక్ట్ గా CPU కి గాని, లాప్ టాప్ కి గాని అటాచ్ చేసి వాడుకోవచ్చు. ఇందుకోసం కేవలం అరమీటర్ కేబుల్ ఉన్న సరిపోతుంది. ఫోన్ ను CPU కి కనెక్ట్ చేసి, ఫోన్ ని డెస్క్టాప్ పైన పెట్టుకోవచ్చు. దీనివల్ల అనవసరం ఎలక్ట్రానిక్ మెటీరియల్ వేస్ట్ అవడం ఉండదు. అలాగే.. ప్యాకేజీ కాస్ట్ కూడా తగ్గుతుంది.

charger 4

# ఇందులో ఉండే వ్యాపార సూత్రం ఏమిటంటే.. షార్ట్ గా ఉండే కేబుల్ ను చార్జర్ తో పాటు ఇచ్చేసి.. లాంగ్ కేబుల్స్ ను కూడా విడిగా అమ్ముతుంటారు. మీ ఫోన్ కి కంపాటిబుల్ అయ్యే అడాప్టర్ మరియు కేబుల్ ని మాత్రమే వాడడం మంచిది. లేదంటే ఫోన్ లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది.


End of Article

You may also like