చికెన్ పాక్స్ సోకినప్పుడు అమ్మవారు/తల్లి పోసింది అని ఎందుకు అంటారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

చికెన్ పాక్స్ సోకినప్పుడు అమ్మవారు/తల్లి పోసింది అని ఎందుకు అంటారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

వర్షాకాలం లో అనేక చర్మ రోగాలు కూడా వస్తుంటాయి. వీటిలో తట్టు కూడా ఒకటి. ఇంగ్లీష్ లో దీనినే చికెన్ పాక్స్ అంటారు. ఒంటినిండా పొక్కులు వచ్చి ఒళ్ళంతా వేడి గా జ్వరం వచ్చినట్లు అయిపోతుంటుంది. చాలా మంది ఇలా వచ్చినప్పుడు తట్టు లేదా పొంగు వచ్చింది అనకుండా.. అమ్మవారు పోసింది అనో.. తల్లి వచ్చింది అనో అంటుంటారు.

Video Advertisement

chicken pox

నిజానికి చికెన్ పాక్స్ కు చాలా మందులు అందుబాటులోనే ఉన్నాయి. కానీ చాలా మంది అమ్మవారు పోసింది అని భావిస్తూ.. ఇంగ్లీష్ మందులను వాడరు. ఎటువంటి మందులు వాడకుండానే ఆ దద్దుర్లు తగ్గి.. సాధారణ స్థితి వచ్చేవరకు జాగ్రత్తలు తీసుకుంటుంటారు.అలాగే చికెన్ పాక్స్ వచ్చిన వారిన వేపాకులపై పడుకోబెడుతుంటారు. వారికి పూర్తి గా తగ్గుముఖం పెట్టేవరకు బయటకు వెళ్లనివ్వరు. అలాగే వేపాకు, పసుపు కలిపి స్నానం చేయిస్తూ ఉంటారు. అసలు చికెన్ పాక్స్ వస్తే.. అమ్మవారు వచ్చింది అని ఎందుకు అంటారో ఇప్పుడు చూద్దాం.

chicken pox 3

పూర్వం జ్వరాసుర అనే ఓ రాక్షసుడు ఉండేవాడట. చిన్నపిల్లల్లో తీవ్ర విషజ్వరాన్ని కలిగించేవాడట. ప్రజలకు ఏమి అర్ధం కాలేదు. చిన్నారులు మాత్రం చాలా అవస్థలు పడేవారు. వారంతా తమ పిల్లలను కాపాడాలంటూ దుర్గాదేవిని ప్రార్ధించడం ప్రారంభించారట. అప్పుడు అమ్మవారి స్వయం గా పిల్లల శరీరం లోకి ప్రవేశించింది. అలా వచ్చినప్పుడే శరీరం పై ఎరుపు రంగులో దద్దుర్లు వచ్చి చర్మం పొంగినట్లు అయింది.

chicken pox 2

అప్పటినుంచి శరీరం పై ఇలా వచ్చినప్పుడు శరీరం లో పేరుకున్న దుష్ట శక్తిని అమ్మవారి స్వయం గా పోగొడుతారని విశ్వసించడం ప్రారంభించారట. అమ్మవారి స్వయం గా రోగాన్ని నయం చేస్తుందని.. దానికి ఎలాంటి మందులు అవసరం లేదని ప్రజలు విశ్వసిస్తారు. కొన్ని రోజులు తగు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి మామూలు అయిపోతారు. అందుకే చికెన్ పాక్స్ వచ్చినప్పుడల్లా అమ్మవారు పోసింది అనో తల్లి వచ్చింది అనో అంటుంటారు.


End of Article

You may also like