చాలా మంది వరల్డ్ టూర్ లకు వెళ్ళేవాళ్ళు చైనా టాయిలెట్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. దానికి కారణం ఇతర దేశాలతో పోలిస్తే.. వీరి టాయిలెట్స్ భిన్నం గా ఉండడమే. అంతే కాదు.. చాలా చోట్ల సెపరేట్ టాయిలెట్స్ అంటూ ఉండవు. అన్ని ఒకేచోట ఇచ్చేస్తారు. సెపరేట్ డోర్స్ కూడా ఉండవట. దీనికి కారణం వారు ఆ విధానానికి అలా అలవాటు పడిపోవడమే అని చాలా మంది చెబుతూ ఉంటారు.

chinese toilet 2

అయితే, కొద్దిగా డెవలప్ అయిన నగరాల్లో మాత్రం చాలా చోట్ల షాపింగ్ మాల్ వంటి పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రం వెస్ట్రన్ మోడల్ లో ఉండే టాయిలెట్స్ ఉంటాయట. అయినా, అక్కడి వారు వీటిని వినియోగించడం కంటే వారి దేశం లో ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న స్క్విట్టింగ్ టాయిలెట్స్ నే వినియోగిస్తారట. ఇప్పటికీ చైనా అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంది. చైనా లో పలు నగరాలు చాలా అభివృద్ధి చెందినట్లు కనిపిస్తాయి. కానీ, గ్రామీణ ప్రాంతాల వైపు చూస్తే.. చాలా చోట్ల కనీసం వెస్ట్రన్ టాయిలెట్స్ కూడా కనిపించవు.

chinese toilet 3

పాత పద్ధతులలో నిర్మించబడిన టాయిలెట్స్ ఎక్కువ గా దర్శనమిస్తాయి. వీటిలో ఎక్కువ గా తలుపులు లేనివే ఉంటాయి. సిచువాన్ లోని అబా ప్రావిన్స్ లోని జియుజైగౌ గ్రామం లో కూడా ఇలాంటివి మనం గమనించవచ్చు. చాలా టాయిలెట్స్ లలో ఫ్లషింగ్ సిస్టం కూడా ఉండదు. వీటిలో కొన్ని ఇండియన్ మోడల్ లాగానే అనిపించినప్పటికీ, ఇండియా లో ప్రతి టాయిలెట్ కి కచ్చితం గా డోర్ ఉంటుంది.

china toilets

అయితే, చైనా లోను టాయిలెట్ వ్యవస్థ గురించి ఓ కోరా యూజర్ ఏమని సమాధానం ఇచ్చారంటే.. “నేను 10 సంవత్సరాల క్రితం షాంఘైని సందర్శించినప్పుడు, పబ్లిక్ బాత్‌రూమ్‌లను ఉపయోగించడానికి నేను ఇష్టపడలేదు, ఎందుకంటే వాటికి తలుపులు లేవు.. చైనా లో టాయిలెట్స్ లో ప్రైవసీ ఉండదు. అయితే మా నాన్న షాపింగ్ మాల్స్ లో వెస్ట్రన్ టాయిలెట్స్ ఉంటాయని తెలిపారు. అయితే అక్కడకి వెళితే.. తలుపులు చాలా చిన్న గా ఉన్నాయి. మనం కూర్చుని ఉన్నపుడు పక్కన వారి ముఖం కనిపిస్తే చాలా ఇబ్బంది కరం…

chinese toilet

ఇక్కడ నేను పోస్ట్ చేసిన ఫోటోలు కూడా నేను తీయలేదు. కాకపొతే వీటిని ఉదాహరణ గా చూపించడానికి ఉపయోగిస్తున్నాను.. కోరా లో కొంతమంది ఇంతకుముందే చెప్పారు.. చైనా లో ఇలా నిలబడి టాయిలెట్ లు వినియోగించడం వలన 160 మెట్రిక్ టన్నుల నీటిని ఆదా చేయచ్చని అక్కడి పోస్టర్ లు కూడా వేసి ఉన్నాయని వారు తెలిపారు.