Ads
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది.
Video Advertisement
ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.
ఇక గల్లీ క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి.. కాలేజీ కుర్రాళ్ళ దాకా అందరు క్రికెట్ ఆడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. మీరెప్పుడైనా గమనించారా? బంతిని కొట్టిన తరువాత ఫీల్డింగ్ లో ఉండి ఆ బంతిని క్యాచ్ చేసే వ్యక్తి.. బంతిని క్యాచ్ చేసిన తరువాత చేతుల్ని వెనక్కి లాగుతారు. ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
బంతి చాలా ఫోర్స్ గా వస్తూ ఉంటుంది. అలా బంతిని క్యాచ్ చేసిన తరువాత రీబౌండ్ అవ్వకుండా ఉండడం కోసం చేతుల్ని కూడా వెనక్కి లాగుతారు. అలా చేయడం వల్ల బంతి వేగాన్ని ఒకేసారి కాకుండా క్రమంగా అదుపు చేయవచ్చు. అప్పుడు బంతి జారిపోకుండా ఉంటుంది. మరో కారణం ఏంటంటే అంత వేగంగా వచ్చిన బంతిని ఒకేసారి ఆపేస్తే అరచేతికి గాయం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చేతుల్ని వేగంగా వెనక్కి లాగుతూ అదే సమయంలో బంతి వేగాన్ని అదుపు చేస్తుంటారు.
End of Article