Ads
క్రికెట్ చూడడం అంటే ఎంతో మందికి ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్ల మొదలు వన్డే మ్యాచ్ల వరకు ప్రతీ మ్యాచ్ ని కూడా చాలా మంది వదలకుండా చూస్తూ వుంటారు. నిజానికి క్రికెట్ చూస్తూ ఉంటే సమయమే తెలియదు. ఇక ఐపీఎల్ మ్యాచ్లు అయితే హోరా హోరీగా జరుగుతాయి. నచ్చిన టీం ని సపోర్ట్ చేస్తూ టీవీ ముందు నుండి కదలరు.
Video Advertisement
ఈ మ్యాచ్లను చూసి ఎంతో సందడి చేస్తూ ఉంటారు అభిమానులు. అయితే మనం క్రికెట్ చూస్తూ ఉంటాము కానీ చిన్న చిన్న విషయాలు మనకు తెలియవు. ఒక్కోసారి స్టేడియం లో ఆడే ప్లేయర్స్ రెండు క్యాప్స్ ని పెట్టుకుంటూ ఉంటారు.
అయితే ఎందుకు రెండు క్యాప్స్ ని ఒకేసారి పెట్టుకుంటారు అన్న అనుమానం చాలా మందిలో కలిగే ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? అయితే మరి దానికి ఆన్సర్ ఇక్కడ వుంది చూసేయండి. క్రికెటర్లు రెండు క్యాప్స్ ని పెట్టుకోవడం ఫ్యాషన్ ఓ లేదంటే స్టైల్ ఓ కాదు. దీని వెనుక ఒక కారణం ఉంది.
అది ఏంటంటే..? రెండు క్యాప్స్ ఆ ప్లేయర్ వి కావు. ఒక క్యాప్ మాత్రమే ఆ ప్లేయర్ ది. మరొక క్యాప్ ఏమో బౌలర్ ది. ఇది వరకు అయితే బౌలర్ బౌలింగ్ వేసే ముందు ఎంపైర్ కి ఆ క్యాప్ ని ఇచ్చేవారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. బౌలర్లు తమ క్యాప్స్ ని కానీ లేదు అంటే టవల్స్ ని కానీ ఎంపైర్ కి ఇవ్వకూడదు.
ఇది వరకు అయితే ఎంపైర్ కి ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఇవ్వకూడదు. కనుక బౌలర్లు బౌలింగ్ వేసేటప్పుడు క్యాప్ ని కెప్టెన్ కి కానీ దగ్గర్లో ఉండే ఫీల్డర్లు కి కానీ ఇచ్చి ఉంచమంటున్నారు. దీంతో వాళ్ళు రెండు క్యాప్స్ ని ఒకేసారి ధరిస్తున్నారు. రెండు క్యాప్స్ ని ధరించడం వెనుక కారణం ఇదే.
End of Article