కలియుగ వైకుంఠం తిరుమలలో వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. ఆయనను దర్శించుకోవడానికి నిత్యం వేల మంది ఆయన దర్శనానికి వెళ్తూ ఉంటారు. కానీ.. స్త్రీలైనా, పురుషులైనా దర్శనానికి వెళ్లేవారు ఎలాంటి పువ్వులను పెట్టుకోరాదనే నియమం ఉంది. అది ఏమిటో.. ఎందుకో తెలుసుకుందాం..

tirumala 1

మన పురాణాల నుంచే మనకో విషయం తెలుసు. విష్ణువు అలంకార ప్రియుడని, శివుడు అభిషేక ప్రియుడనీ మనకు తెలుసు. విష్ణువు అంశ అయినా వెంకటేశ్వర స్వామి కూడా పుష్పాలంకార ప్రియుడు. స్వామికి ఎన్ని పుష్పాలు అలంకరిస్తే అంత ప్రీతీ చెందుతాడు. అందుకే.. తిరుమలలో స్వామికి ఎక్కువ పుష్పాలతో అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల సమయం లో కూడా వేల రకాల పుష్పాలతో పుష్ప యాగం నిర్వహిస్తూ ఉంటారు. కంచి మండపాన్ని త్యాగ మండపం,శ్రీ రంగాన్ని భోగి మండపం అని పిలిచినట్లు తిరుమల ను పుష్ప మండపం అని పిలుస్తారు.

tirumala 2

తిరుమలలో దొరికే ప్రతి పువ్వు స్వామివారికోసమే.. అందుకే ఇక్కడ స్త్రీలు అయినా.. పురుషులు అయినా పువ్వులు ధరించరాదనే నియమం ఉంది. అక్కడ వారు కూడా అన్ని పుష్పాలను శ్రీవారికి అర్పిస్తూ ఉంటారు. అందుకే అక్కడ ఎవరు పువ్వులు ధరించరు.. అన్ని పుష్పాలను శ్రీవారికి సమర్పిస్తారు.