Ads
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది.
Video Advertisement
ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.
Also Read: నేషనల్ అవార్డ్ విజేతని “బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్” చేశారుగా..? ఎవరంటే..?
అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? క్రికెట్ లో అన్ని దేశాల జట్లు ఉంటాయి. కానీ చైనా నుండి మాత్రం క్రికెట్ జట్టు ఉండదు. అందుకు కారణం ఏంటంటే. సాధారణంగా ఒలంపిక్స్ లాంటి గ్లోబల్ స్పోర్ట్స్ లో చైనా ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. ఒలంపిక్స్ లో ఎంతోమంది చైనా ప్లేయర్లు ఎన్నో మెడల్స్ సాధించారు.
కానీ క్రికెట్ అనేది ఒలంపిక్స్ లో ఒక భాగం కాదు. అందుకే చైనా క్రికెట్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అంతే కాకుండా చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే. చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు. క్రికెట్ ఆడుతున్న దేశాలు ఎప్పుడో ఒక సమయంలో సమయంలో బ్రిటిష్ పాలనలో ఉన్నాయి.
చైనా లో ఎక్కువగా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ బాగా ఆడతారు. ఈ రెండు ఆటలు ఒలంపిక్స్ లోకి వస్తాయి. క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్ కిందకి రాదు. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్ లో పాల్గొంటాయి. చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
అయితే, చైనా కి క్రికెట్ టీం ఉంది. 2009 లో ఏసీసీ ట్రోఫీ ఛాలెంజ్ లో ఈ జట్టు పాల్గొంది. కానీ మొదట మ్యాచ్ లలో ఓడిపోయింది తర్వాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ విజయం నమోదు చేసుకుంది. అంతే కాకుండా ఐసిసి చైనాలో కూడా క్రికెట్ ని ప్రమోట్ చేస్తున్నారు. 2019 లో జరిగిన టి 20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్ లో చైనా ఉమెన్ టీం కూడా పాల్గొని విజయం సాధించింది.
Also Read: ఈ 14 మంది సినిమా నటులు మనందరికి తెలుసు? కానీ వారి బంధువులు వీరు అని తెలుసా?
End of Article