డొమినోస్ పిజ్జా వారు ఆర్డర్ చేసిన ప్రతి కస్టమర్ కి ఎక్స్ట్రా ఒరిగానో పాకెట్స్ ని ఎందుకు ఇస్తారు..? అసలు కారణం ఇదే..!

డొమినోస్ పిజ్జా వారు ఆర్డర్ చేసిన ప్రతి కస్టమర్ కి ఎక్స్ట్రా ఒరిగానో పాకెట్స్ ని ఎందుకు ఇస్తారు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

పిజ్జా ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వెస్ట్రన్ ఫుడ్ ఐటెం అయినప్పటికి.. తెలుగు వాళ్ళు కూడా బాగా ఇష్టపడే వంటకాల్లో పిజ్జా ఒకటి. దీనిని ఇంట్లో చేసుకునే వారు తక్కువే. కానీ, ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకునే వారి సంఖ్య మాత్రం ఎక్కువే ఉంటుంది. మనం ఇంట్లో చేసినప్పటికీ.. హోటల్ లో చేసిన టేస్ట్ రాదు. అందుకే.. చాలా మంది ఇంట్లో చేసుకోవడానికంటే.. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు.

Video Advertisement

pizza 1

డొమినోస్ వారి పిజ్జా బాగా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. వీరి స్టోర్ నుంచి మనం పిజ్జా ఆర్డర్ చేస్తే.. కచ్చితం గా పిజ్జా తో పాటు ఎక్స్ట్రాగా ఒరిగానో పాకెట్స్ వస్తాయి. వాటితో పాటు చిల్లి పౌడర్ పాకెట్స్ ని కూడా పంపిస్తాడు. మనకి ఇచ్చిన పిజ్జా పై ఆల్రెడీ వాటిని వేసినా.. మళ్ళీ ఎక్స్ట్రాగా పాకెట్స్ ఎందుకు పంపిస్తాడో తెలుసా..? అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ.

pizza 2

మాములుగా.. ప్రతి ఆర్డర్ కి ఎక్స్ట్రా ఒరిగానో పాకెట్స్ పంపించాలంటే.. కొంత ఖర్చు కూడా చేయాల్సి ఉంటుంది. మనం పిజ్జా కి 500ల రూపాయలు చెల్లిస్తే.. ఎక్స్ట్రా ఒరిగానో పాకెట్స్ పంపడానికి వారు మరో యాభై రూపాయలు కేటాయిస్తారని అనుకుందాం.. ఆ లెక్కన.. వారు ఎక్స్ట్రా గా పంపిన పాకెట్స్ మనలో చాలామంది దాచుకుంటాం. మరోసారి.. పిజ్జా తినేటప్పుడు వేసుకుందాం అని పక్కన పెడతాం. మనం ఇంట్లో ఉన్న టైం లో ఈ పాకెట్స్ కనిపిస్తే.. మనకి పిజ్జా తినాలి అనే కోరిక ఆటోమేటిక్ గా కలుగుతుంది.

pizza 3

అంటే.. మనం మళ్ళీ పిజ్జా కొనడానికి మరో ఐదొందల రూపాయలని ఖర్చు చేస్తాం అన్నమాట. కానీ కొందరు టిపికల్ ఇండియన్స్ ఏమి చేస్తారంటే.. ఆ పాకెట్స్ ని పక్కన పెట్టి స్ట్రీట్ సైడ్ షాప్స్ లో పిజ్జా తెచ్చుకుని ఎంచక్కా వాటిపై ఆ ఒరిగానో వేసుకుని తినేస్తుంటారు. ఆ డొమినోస్ సంస్థ కి కూడా అందని స్ట్రాటజీస్ మనవి.. ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్స్ తో ఎవరూ మన తెలుగోళ్ళని బుట్టలో వేసుకోలేరు అనుకోండి. అది వేరే విషయం.


You may also like