Ads
సౌత్ ఇండియాలో ఎక్కువగా మాట్లాడే భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. ఇవన్నీ భాషా కుటుంబాలలో ఒకటి అయిన ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు. అందువల్ల ఈ భాషలను ద్రావిడ భాషలు అని పిలుస్తారు.
Video Advertisement
వీటిలో తెలుగు లిపి, కన్నడ లిపి కాస్త దగ్గరగా ఉంటాయి. దానివల్ల తెలుగువాళ్లు మరియు కన్నడవాళ్ళలో ఎక్కువ మంది రెండిటిని చదవగలరు. అయితే తెలుగు, కన్నడ భాషలు ఒకేలా ఎందుకు ఉంటాయో? ద్రవిడ భాషా కుటుంబం గురించి ఇప్పుడు చూద్దాం..
ప్రపంచంలో ప్రతి ఒక భాషకు చరిత్ర ఉంటుంది. బీబీసీ తెలుగు కథనం ప్రకారం, వాటి మూలాలు, నిర్మాణం ఆధారంగా భాషలను కుటుంబాలుగా విభజించారు. ఇక ఇండియాలోని భాషలను ప్రధానంగా ఐదు భాషా కుటుంబాలని పరిశోధకులు చెబుతున్నారు. అవి..
ఇండో-యూరోపియన్: హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్, లాటిన్, గ్రీక్,
ద్రవిడియన్: తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, కోయ, గోండి,
ఆస్ట్రో-ఏసియాటిక్: ముండారి, సంతాళి, సవర, ఖాశీ
టిబెటో-బర్మీస్: మణిపురి, త్రిపురి, బోడో, టిబెటన్
సెమిటో హామిటిక్: అరబిక్/అరబివీటిలో తెలుగు, కన్నడ భాషల గురించి తెలియాలంటే ద్రవిడ కుటుంబం గురించి తెలుసుకోవాలి. ఈ ద్రవిడ కుటుంబాన్ని 4 వర్గాలుగా విభజించారు. అవి ఏంటంటే దక్షిణ ద్రవిడ భాష, దక్షిణ-మధ్య ద్రవిడ, మధ్య ద్రవిడ, ఉత్తర ద్రవిడ భాషలు. మూల దక్షిణ ద్రవిడ భాషల నుండి దక్షిణ మధ్య ద్రవిడ భాషలు వచ్చాయని ప్రముఖ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి ‘ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’ అనే బుక్ లో రాశారు.
అంటే తెలుగు మరియు కన్నడ భాషలు రెండు ఒకే మూలం నుండి వచ్చాయి. అందువల్లే ఈ రెండు భాషల మధ్య లిపి, నిర్మాణంలో సారూప్యత కనిపిస్తుంది. తెలుగు, కన్నడ భాషలో ఉండే శాసనాలు 6వ శతాబ్దం నుండి కనిపించడం ప్రారంభం అయ్యింది. క్రీ.శ.624 – 1189 మధ్య పాలించిన వేంగి చాళుక్యుల కాలంలోని శాసనాలు తెలుగు-కన్నడ లిపిలో ఉన్నాయి. 15వ శతాబ్దం వరకు తెలుగు, కన్నడ లిపి ఒక్కటిగా ఉండి ఆ తరువాత కాలంలో విడివిడిగా ప్రయాణించాయి.
తెలుగు లిపిలోని అక్షరాల పైన ఉండే అడ్డగీత, తలకట్టుగా మారింది. వంకరగా ఉండే అక్షరాలు కాస్త గుండ్రంగా మారాయి. కానీ కన్నడ లిపిలో అడ్డగీతలు అలాగే ఉన్నాయి. లిపిలోని వంకర అక్షరాలు పూర్తిగా పోలేదు. కన్నడ లిపి కోణాకారంలోకి మారింది. అయితే ప్రిటింగ్ యంత్రాలు వచ్చిన తరువాత తెలుగు అక్షరాలలో ఈ మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. పాతకాలంలోని గ్రంథాలలో తలకట్టు కనిపించదు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మనం కామా, ఫుల్స్టాప్ ఉపయోగిస్తున్నాము. అయితే పాతకాలం తెలుగులో కామాకు బదులుగా ఒక నిలువు గీతను, ఫుల్ స్టాప్ కు బదులుగా రెండు నిలువుగీతలను ఉపయోగించేవారు. విదేశీయులు తీసుకువచ్చిన అచ్చుయంత్రంతో ముద్రణ మొదలుపెట్టిన తరువాత తెలుగు అక్షరాలు చక్కని రూపంతో పాటుగా కామా, ఫుల్ స్టాప్ వంటివి చేరాయి.ప్రాచీన తెలుగు భాషా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ ఒకప్పుడు తెలుగు, కన్నడ భాషల లిపి ఒకటేనని ఆ తరువాత జరిగిన పరిణామంలో రెండూ విడిపోయాయని వెల్లడించారు. అర్ధం అయ్యేలా సులభంగా చెప్పాలంటే తెలుగు కన్నడ భాషలు రెండు ఓకే ఇంటిలో జన్మించి, విడిపోయిన సోదరులు అని చెప్పవచ్చు.
Also Read: అంత క్రేజ్ సంపాదించుకున్న “నానో కార్” అంత ఘోరంగా ఎందుకు ఫెయిల్ అయ్యింది..? కారణం ఇదేనా..?
End of Article