“చాణిక్య నీతి”లోని విషయాలు అంత పాతవి అయినా సరే… ఇప్పటికీ ఎందుకు అనుసరిస్తారు..?

“చాణిక్య నీతి”లోని విషయాలు అంత పాతవి అయినా సరే… ఇప్పటికీ ఎందుకు అనుసరిస్తారు..?

by Anudeep

Ads

ఎన్నో సంవత్సరాల నుండి భారతీయులు అనుసరించే వాటిలో చాణిక్య నీతి ఒకటి. ఒక మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో పాఠాలను చాణిక్యుడు అప్పుడే చెప్పారు. ఇప్పుడు అవే ఎంతోమంది పాటిస్తున్నారు. అయితే చాణిక్య నీతి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన ది. అందులో రాసిన చాలా విషయాలు కూడా ఆ కాలానికి తగ్గట్టుగా ఉంటాయి. కొన్ని ఈ కాలం వాళ్ళు అనుసరించే పద్ధతులు లాగా అనిపించవు.

Video Advertisement

కానీ చాణిక్య నీతిని చాలా మంది అనుసరిస్తారు. అందుకు కారణం ఏంటి అనే విషయాన్ని కోరాలో ఒక వ్యక్తి పోస్ట్ చేశారు. ఆ ప్రశ్నకి శ్రేయాన్ష్ గౌతమ్ అనే ఒక కోరా యూజర్ వ్యక్తి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ విధంగా రాశారు. “నేను నా జీవితంలో చాణిక్య నీతిని అనుసరించేవారిని, అలాగే అందులో రాసిన వాటిని గౌరవించే వారిని చాలా మందిని చూశాను. కానీ నేను మాత్రం వాటికి అంగీకరించను. ఇందుకు కారణం ఏంటంటే ఆ పుస్తకాలు 2300 సంవత్సరాల క్రితం రాసినవి. ఇన్ని సంవత్సరాలలో టెక్నాలజీ పెరగడం వల్ల అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చాలా మార్పులు రావడం వల్ల మనిషి లైఫ్ స్టైల్ అనేది చాలా మారింది. అందుకే అందులో రాసినవి కొన్ని అర్థం లేనట్టుగా అనిపిస్తాయి. రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు ఈ పుస్తకం రాశారు. అందుకే ఆ సలహాలు ఇప్పుడు పనికొచ్చే విధంగా అనిపించవు. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా అనిపించవు. ఇందులో రాసిన కొన్ని విషయాలు బాగుంటాయి. కానీ అలాంటి సలహాలు సాధారణంగా ఎవరైనా ఇవ్వగలరు.”

అదేవిధంగా చాణక్య నీతి ఇప్పటికి కూడా ఎందుకు అనుసరిస్తారు అనే విషయంపై మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. “మన భారత దేశ ప్రజలు మన సాంప్రదాయం, సంస్కృతికి చాలా గౌరవం ఇస్తారు మన భారతదేశంలో ఉన్నంత జ్ఞానం వేరే ఎక్కడా ఉండదు అని అంటూ ఉంటారు. చాలావరకు అది నిజమే. చాణిక్య నీతి అనేది భారతదేశ సంస్కృతిలో రూపొందించబడిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. ఇలాంటి పుస్తకాన్ని ఆదరిస్తే మన భారతదేశానికి గర్వించదగ్గ విషయం అవుతుంది. అలాగే ఇంత గొప్ప పని చేసిన వారికి విలువ ఇవ్వడం కూడా అవుతుంది” అని రాశారు. అందుకే చాణిక్య నీతిని అందులో రాసిన చాలా విషయాలని చాలామంది పాటిస్తారు.

sourced from : Quora (Shreyansh Gautam)


End of Article

You may also like