సింగర్స్ రికార్డింగ్ స్టూడియో లో హెడ్ ఫోన్స్ ని ఎందుకు ఉపయోగిస్తారు…? దీని వెనుక కారణం ఇదే…!

సింగర్స్ రికార్డింగ్ స్టూడియో లో హెడ్ ఫోన్స్ ని ఎందుకు ఉపయోగిస్తారు…? దీని వెనుక కారణం ఇదే…!

by Megha Varna

ఎప్పుడైనా మనం రికార్డింగ్ స్టూడియో లో గాయకులని లేదా యాక్టర్లని చూసినప్పుడు వాళ్లు హెడ్ ఫోన్స్ ని వాడతారు. అయితే ఎందుకు రికార్డింగ్ స్టూడియోలో హెడ్ ఫోన్స్ ని పెట్టుకుంటారు అనే దాని గురించి చాలా మందికి సందేహం కూడ వుంటుంది. చూడడం అయితే చూస్తాం కానీ క్లియర్ గా దాని గురించి మనకి తెలియదు. దాని కోసమే ఈరోజు మనం తెలుసుకుందాం.

Video Advertisement

మామూలుగా అయితే దేనినైనా రికార్డ్ చేయాలంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ని వేరు వేరుగా రికార్డ్ చేసి.. ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేసి.. మిక్స్ చేయడం జరుగుతుంది. ప్రతి చిన్న మ్యూజిక్ ని కూడా మిస్ అవ్వకుండా వినడం గాయకుల బాధ్యత. లేదు అంటే ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. అందుకని దేనిని కూడా అస్సలు మిస్ అవ్వకుండా పాడడానికి హెడ్ ఫోన్స్ ని వాడతారు.

అదే విధంగా హెడ్ ఫోన్స్ వల్ల నాయిస్ కూడా రాకుండా ఉంటుంది. మామూలుగా ఒక ట్యూన్ కి మూడు రకాలు ఇన్స్ట్రుమెంట్స్ ని వాడితే ఆ ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఉన్న మైక్రో ఫోన్ లో రికార్డు అవుతుంది. అదే ఒకవేళ మూడు వివిధ రకాల మైక్రోఫోన్స్ లో రికార్డ్ చేస్తే మైక్రో ఫోన్ అన్ని సౌండ్స్ ని తీసుకు లేకపోవచ్చు.

ధ్వని లో కాస్త ఇబ్బంది కలగడం లేదా షార్ప్ నెస్ లేకపోవడం జరుగుతుంది. అలాగే ఎడిటింగ్ ని చేయడం లో కూడా కష్టం అవుతుంది. క్రోడెడ్ బార్ లో పక్క వాళ్లకి చెవిలో చెప్పినా అర్థం కాదు కూడా. లాజిక్ గా అయితే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినకపోతే స్పీకర్ లో వినాలి. అలా చేస్తే అవి కూడా రికార్డు అవుతుంది. ఒకవేళ లైవ్ కాన్సర్ట్స్, బ్యాండ్లు వంటి వాటిలో అయితే ట్యూన్ తో పాటు పక్క వాళ్ళు ఏం పాడారో కూడా వినాల్సి వస్తుంది. అందుకు ఇన్ ఇయర్ మానిటర్ ని వాడతారు.


You may also like