ఇండియాలో అధిక సంఖ్యలో ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు. వేరే వాహనాలతో పోలిస్తే ట్రైన్ జర్నీ ఎంతో  సౌకర్యంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే వారు ఎంపిక చేసుకునేది రైలు ప్రయాణమే. ఇక రైలులో ప్రయాణించని వారు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ రైలును చూసే ఉంటారు.

Video Advertisement

అయితే ట్రైన్ ను గమనించినప్పుడు దాని మీద కొన్ని ప్రత్యేకమైన గుర్తులు కనిపిస్తుంటాయి. అందులో ఎక్కువగా ‘ఎక్స్’ మరియు ‘ఎల్వీ’ అనే గుర్తులు కనిపిస్తాయి. మరి ఆ గుర్తులు రైలు వెనకభాగంలో ఎందుకు రాస్తారో?  దానికి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణించే సమయంలో కానీ, వాటి కోసం వేచి చూసే సమయంలో కానీ రైల్వే స్టేషన్ లో కనిపించే రైళ్ల పై చాలా రకాల గుర్తులు కనిపిస్తుంటాయి. వాటిలో ఎక్కువగా రైలు వెనకాల ఉండే ఎక్స్ గుర్తును దాదాపు అందరు చూసే ఉంటారు. ఈ గుర్తు రైలు చివరి బోగి పై చాలా పెద్దగా రాసి ఉంటుంది. అందువల్ల తేలికగా కనిపిస్తుంది.
నిజానికి ఈ పెద్దగా రాసిన ఎక్స్ గుర్తు ఎల్లప్పుడూ ట్రైన్ ఆఖరి బోగీ పై రాస్తారు. దీని అర్థం ఏమిటంటే ఆ గుర్తు ఉన్న బోగీ ఆ రైలు యొక్క ఆఖరి పెట్టె. ఇక ప్యాసింజర్ ట్రైన్ చివరి పెట్టెలో ఎక్స్ మాత్రమే కాకుండా ఎల్‌వి అనే గుర్తు లేదా అక్షరాలు కూడా ఉంటాయి. ఎల్‌వి అనగా లాస్ట్ వెహికల్ అని అర్ధం. ఈ రెండు గుర్తులు ముఖ్యంగా రైల్వే ఉద్యోగులకు మరియు అధికారులకు సంబంధించినవి.
ఒకవేళ రైలు చివరి బోగీ మీద ఎక్స్ లేదా ఎల్వి గుర్తు కనిపించకపోతే రైల్వే ఉద్యోగి లేదా అధికారి వెంటనే అలర్ట్ అయ్యి ఆ విషయన్ని సమీప కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేస్తాడు. ఈ రెండు గుర్తులు రైలు చివరి బోగీ పై  కనిపించకపోతే ఆ రైలు యొక్క చివరి బోగీ లేదా రైలు కొంత భాగం ఆ ట్రైన్ నుండి వేరు అయ్యిందని అర్ధం.

Also Read: స్పీడ్ లో దీన్ని మించింది లేదు..! “కోరమాండల్” సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చరిత్ర ఎంటో తెలుసా..?