థియేటర్ నుండి బయటకి రాగానే సడన్ గా వెలుతురుని ఎందుకు చూడాలేమో తెలుసా.?

థియేటర్ నుండి బయటకి రాగానే సడన్ గా వెలుతురుని ఎందుకు చూడాలేమో తెలుసా.?

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా, జనాలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం అనేది చాలా కష్టమైపోయింది. దాంతో టీవీకి మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. అంతే కాకుండా థియేటర్లలో విడుదల అయిన సినిమాలు కూడా, కొద్ది రోజుల్లోనే డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. ఏదేమైనా కానీ, థియేటర్లలో సినిమా చూడడం అనేది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

Video Advertisement

జనాల మధ్య, ఆ ఎంజాయ్‌మెంట్ లో సినిమా చూడడం చాలా మందికి నచ్చుతుంది. అందుకే ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా, ఆలస్యం అయినా పర్లేదు కానీ సినిమా మాత్రం కచ్చితంగా థియేటర్లలో విడుదల అవ్వాలి అని ఆలోచిస్తున్నారు.

why do we cannot see the light after coming out of the theatre

ఇదంతా పక్కన పెడితే, థియేటర్లలో నుండి బయటికి వచ్చిన తర్వాత ప్రతి ప్రేక్షకుడికి ఒక సంఘటన ఎదురవుతుంది. అదేంటంటే, సినిమా అయిపోయాక థియేటర్ నుండి మనం బయటికి రాగానే వెలుతురు చూస్తే మనకు ఏమీ కనిపించదు. ఇది ఎక్కువగా ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో జరుగుతూ ఉంటుంది. దీని వెనకాల ఒక కారణం ఉంది. అదేంటంటే, మన కళ్ళలో సిలియరీ కండరాలు ఉంటాయి. ఆ కండరాలు ముడుచుకుపోతూ, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి.

why do we cannot see the light after coming out of the theatre

థియేటర్లో వెలుగు తక్కువగా ఉంటుంది. అలాగే థియేటర్ స్క్రీన్ ప్రేక్షకులకి చాలా దూరంలో ఉంటుంది. అలాంటప్పుడు సిలియరీ కండరాలు ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయి. అదే మనం థియేటర్లో నుండి బయటికి రాగానే వెలుగు ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ కండరాలు ముడుచుకుపోతాయి. అవి మళ్ళీ మామూలుగా అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఆ కొంత సమయంలో వెలుతురు ఏమీ కనిపించదు.

blue eyes

అలాగే వెలుతురులో ఉన్నప్పుడు సిలియరీ కండరాలు ముడుచుకుపోయి ఉంటాయి. మనం చీకటిలోకి వెళ్ళగానే ఆ కండరాలు ఎక్స్పాండ్  అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అందుకే, థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు కానీ, అలాగే థియేటర్లో నుండి బయటికి వచ్చేటప్పుడు కానీ వెలుతురు చూడటం వల్ల కొంచెం సేపు ఏమీ కనిపించదు. తర్వాత మళ్లీ మామూలు అవుతుంది.


End of Article

You may also like