పులిపిరి కాయలు ఎందుకు వస్తాయి..? వాటిని వదిలిచ్చుకోవాలంటే ఇంట్లో ఈ మూడు పనులు చేసి చూడండి..!

పులిపిరి కాయలు ఎందుకు వస్తాయి..? వాటిని వదిలిచ్చుకోవాలంటే ఇంట్లో ఈ మూడు పనులు చేసి చూడండి..!

by Anudeep

Ads

పులిపిరి కాయలు అంటే ఏంటో తెలుసా..? చర్మం మీద నల్లగా చిన్న పొక్కులలాగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి కలిగే నష్టం ఏమి ఉండదు. కానీ, వీటి వల్ల చర్మం పాడై.. అందం పోతుంది.

Video Advertisement

అందుకే చాలా మంది వీటిని వదిలిచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీటిని వదిలిచ్చే ముందు.. అసలు ఇవి ఎందుకు వస్తాయో కూడా తెలుసుకోవడం అవసరమే.

pulipiri 1

మన శరీరంలోని యాంటీబాడీస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి కారణం అయ్యే వైరస్ తో ఫైట్ చేయడం వలన పులిపిరిలు వస్తాయి. ఇది అందరి శరీరంలోను జరిగేదే. కానీ పులిపిర్లు మాత్రం అందరికి రావు. ఎప్పుడైతే శరీరంలో యాంటీ బాడీస్ ఫైట్ చేయడం వలన.. కొన్ని డెడ్ వైరస్ మూలకాలు చర్మం పైన పొంగులా వస్తాయో.. అవి నల్లగా మాడి పులిపిరి కాయల్లా ఏర్పడతాయి. ఇవి కొన్ని నల్లగా ఏర్పడతాయి.. మరికొన్ని రఫ్ గా బుడిపెల్లాగా ఏర్పడతాయి.

pulipiri 2

వీటివల్ల ఎలాంటి ప్రమాదమూ జరగదు. వీటి వల్ల నొప్పి కూడా ఉండదు. కొందరికి మాత్రం ఆ ప్రాంతంలో నొక్కగానే.. లేదా ఏదైనా స్పర్శ తగిలినా నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమందిలో లోపలికి వెళ్లిన వైరస్ లో జీవకణాలు వృద్ధి చేసుకుని పులిపిరిలోకి కూడా వ్యాప్తి చెంది ఉంటాయి. అందువల్ల వీరికి నొప్పి కలిగే అవకాశం ఉంటుంది. నొప్పి మరీ ఎక్కువ గా ఉన్నట్లయితే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం. పులిపిరి కాయలను పోగొట్టుకోవడానికి ఈ కింది టిప్స్ ను ప్రయత్నించి చూడండి.

pulipiri 3

# బసవరాజీయం అనే ఆయుర్వేద బుక్ ప్రకారం, కామంచి ఆకుల రసానికి, సైంధవ లవణం కలిపి పులిపిరులకు పట్టిస్తే.. తొందరలోనే అవి రాలిపోతాయి.

# తమలపాకు తొడిమని పట్టుకుని పైకి, కిందకి రుద్దితే రసం వస్తుంది. ఈ రసాన్ని పులిపిరులకి పట్టించినా మంచి ఫలితం ఉంటుంది. ఒక మూడు నెలల కాలం లో ఇవి రాలిపోయే అవకాశం ఉంటుంది.

# హోమియోలో మందులు వాడుతున్న వారైతే.. ఆసిడ్ నైట్రికం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.

 


End of Article

You may also like